పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న సినిమా “ఓజి”పై ప్రేక్షకుల్లో ఎప్పటినుంచో భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల ఒక పాటతో ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన చిత్రబృందం, ఇప్పుడు మరో కొత్త అప్‌డేట్‌ను ప్రకటించింది. ఈ చిత్రంలో పవన్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా ఆమెను కన్మణిగా పరిచయం చేస్తూ రెండు ఫస్ట్ లుక్ పోస్టర్లను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లలో ప్రియాంక మోహన్ సింపుల్‌గా, క్లాసీ లుక్‌లో కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంది. మరో పోస్టర్‌లో పవన్ కళ్యాణ్ పాత్ర అయిన ఓజాస్ భార్యగా చూపించడంతో ఆమె రోల్‌కి మరింత క్లారిటీ వచ్చింది.
ఇక మేకర్స్ ఇక్కడితో ఆగలేదు. త్వరలోనే రెండో పాట ప్రోమోను కూడా విడుదల చేస్తామని స్పష్టంగా తెలిపారు. దీంతో ఫ్యాన్స్ ఆనందంగా రియాక్ట్ అవుతున్నారు. మొత్తం మీద “ఓజి” సినిమాకి వస్తున్న ప్రతి అప్‌డేట్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.
