శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఓదెల 2!

Andhrawatch
1 Min Read

ఓదెల రైల్వే స్టేషన్‌ ..2021 లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకుంది. తమన్నా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ప్రస్తుతం సీక్వెల్‌ శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటుంది. దీంతో ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మాస్‌ డైరెక్టర్‌ గా పేరు పొందిన సంపత్‌ నంది చిత్రీకరించిన ఈ  చిత్రాన్ని ఇప్పుడు అశోక్‌ తేజ దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి ఇంతకుముందే విడుదలైన ఫస్ట్‌ లుక్‌ గ్లింప్స్‌, మేకింగ్‌ వీడియోకు సినీ ప్రేక్షకులు నుంచి మంచి విశేష స్పందని లభించింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌ లో కీలకమైన యాక్షన్‌ సంబంధించిన సన్నివేశాలను షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటుంది.

సినిమాలోని కీలకమైన యాక్షన్‌ సన్నివేశాలకు సంబంధించి చిత్ర యూనిట్‌ ఫోకస్‌ చేసింది. ముఖ్యంగా ఈ యాక్షన్‌ సన్నివేశాలు ప్రేక్షకులను మైమరిపించేందుకు విజువల్ ట్రీట్‌ గా ఉండేలా సినిమా బృందం సన్నాహాలు చేస్తుంది.ఈ యాక్షన్‌ సన్నివేశాలు సినీ ప్రేక్షకులకు బాగా అందించేందుకు తమన్నా కొన్ని సన్నివేశాల్లో నటించేందుకు కఠినమైన శిక్షణతో పాటు కొన్ని రిహార్సల్స్‌ లో పాల్గొంటుంది.

Share This Article