ఎన్టీఆర్ అంటేనే మాస్ ప్రేక్షకులకు ప్రత్యేకమైన గుర్తింపు. ప్రస్తుతానికి ఆయన పెద్ద సినిమాలతో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా వార్ 2 సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమా కూడా ఫ్యాన్స్ లో ఆసక్తి రేపుతోంది. ఈ రెండు సినిమాల మద్యలో నేడు నందమూరి కుటుంబానికి చాలా ప్రత్యేకమైన రోజు.
నేడు మే 28న సీనియర్ ఎన్టీఆర్ 102వ జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున అభిమానులు, కుటుంబ సభ్యులు ఆయనను గుర్తు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్, ఆయన అన్న కళ్యాణ్ రామ్ కలిసి ఉదయాన్నే ఘాటుగా వెళ్లి నివాళులు అర్పించారు. ఆ ఫోటోలు, వీడియోలు బయటికి వచ్చి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ భావోద్వేగపు దృశ్యాలు నందమూరి ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నాయి.
ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ తన తాతను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెడుతుంటాడు. ఈసారి కూడా తన మనసులోని భావాలను పంచుకుంటూ రాసిన మాటలు అభిమానుల హృదయాలను తాకాయి. తాత అంటే తనకు ఎంతగా ఇష్టమో, ఆయన లేకపోవడం వల్ల ఎంతటి లోటు అనిపిస్తుందో తారక్ తన మాటల్లో తెలియజేశాడు. ఈ పోస్టు ఇప్పుడు నెటిజన్లలో పెద్ద చర్చకు మారింది.
మొత్తానికి ఈ రోజు నందమూరి అభిమానులకు భావోద్వేగాలకి లోనయ్యే రోజు. సీనియర్ ఎన్టీఆర్ చూపిన దారిలో జూనియర్ ఎన్టీఆర్ ముందుకు వెళ్లడం, తన తాత పట్ల చూపించే గౌరవం ఫ్యాన్స్ ని మరింతగా ఆకట్టుకుంటున్నాయి.
ఈ సినిమా పాన్ ఇండియా మాత్రమే కాదు, అంతకంటే ఎక్కువ స్థాయిలో పాన్ వరల్డ్ లెవెల్లో ఆకట్టుకునేలా తెరకెక్కుతోంది. టీజర్ లో మంచు మనోజ్ నెగటివ్ షేడ్ లో చూపించిన విధానం అలరిస్తే, తేజ సజ్జ “హను మాన్” తర్వాత తన మీద పెద్ద బరువు వేసుకున్నట్టు అనిపిస్తోంది. టీజర్ చివర్లో రాముని రాక చూపించిన సీన్ అయితే అద్భుతంగా ఉంది.
