పని చేసే యోగ్యత లేదు గానీ.. సెటైర్లు ఎక్స్‌ట్రా..!

Thursday, November 7, 2024

ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పరిపాలించిన అయిదేళ్లు కాలంలో రోడ్డు మార్గంలో ప్రయాణాలు సాగించాలంటే.. రాష్ట్ర ప్రజలు భయపడిపోయారు. తమ వాహనాలు సర్వనాశనం అయిపోతాయని ఆందోళన చెందారు. కేవలం గోతిలో వాహనం పడడం వల్ల ప్రమాదం జరిగి మరణించిన వారి సంఖ్య ఆ అయిదేళ్లలో వందల్లోనే ఉండవచ్చు.  జగన్ ప్రభుత్వం సిగ్గుపడాల్సిన విషయం అది. జనం జేబుల్లో డబ్బులు పెట్టేసి వారిని ఓటు బ్యాంకుగా మార్చుకోవాలనే ఆలోచన తప్ప జగన్ ప్రభుత్వం ఇంకో పనిచేయలేదు. రోడ్ల మరమ్మతులు వంటివి అసలు పట్టించుకోలేదు.

ఆ రకంగా పనిచేసే యోగ్యత లేని పార్టీకి చెందిన వారు.. ఇప్పుడు చంద్రబాబునాయుడు పనిచేస్తూంటే సెటైర్లు వేస్తున్నారు. రోడ్ల మరమ్మతు గురించి కూడా ప్రచారం చేసుకుంటున్నారంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేయడం విశేషం.
860 కోట్ల రూపాయల వ్యయంతో రోడ్ల మరమ్మతులను చంద్రబాబునాయుడు ప్రారంభించారు. ఆయన స్వయంగా మరమ్మతు పనులను ప్రారంభించారు. సంక్రాంతి నాటికెల్లా.. గుంతల్లేని రోడ్లతో రాష్ట్రం కళకళ లాడేలా తీర్చిదిద్దుతామని చంద్రబాబు ప్రకటించారు.

అయితే ఈవిషయమై విజయసాయిరెడ్డి ట్వీట్ చేస్తూ ‘‘చంద్రబాబుకు మాటలెక్కువ, చేతల తక్కువని మరోసారి చాటుకున్నారు.. ఏ ప్రభుత్వానికైనా రోడ్ల మరమ్మత్తులు అన్నది ఓ నిరంతర కార్యక్రమం/ప్రక్రియ. దాని ప్రచారానికి, ఆర్భాటాలకి ప్రభుత్వ ధనం వృధా చేయడం చంద్రబాబు నైజం’’ అని వ్యాఖ్యానించడం ఆయన కురచబుద్ధిని నిరూపిస్తోందని ప్రజలు అంటున్నారు.
వైసీపీ హయాంలో రోడ్లు బాగు చేయకుండా ప్రజల ప్రాణాలు తీసారని అంతా దెప్పి పొడుస్తున్నారు.
ఇప్పుడు రాష్ట్రప్రభుత్వం 860 కోట్ల రూపాయల వ్యయంతో మరమ్మతులు చేపడుతోంది.

వైసీపీ పరిపాలన కాలంలో కూడా రోడ్ల కోసం అనే ముసుగులో వెయ్యి కోట్లు ఖర్చు చేశారు గానీ.. మరమ్మతులు మాత్రం చేపట్టలేదని చంద్రబాబు అన్నారు. సంపద సృష్టించాలంటే.. రోడ్లు బాగుండడం కూడా ఎంతో ముఖ్యం అని చంద్రబాబు అనడాన్ని గమనించాలి.
రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి సాధించడానికి చంద్రబాబు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతున్నట్టు కనిపిస్తోంది. 1.25 లక్ష్లల కోట్ల విలువైన జాతీయ రహదారులు రాష్ట్రంలో ఈ అయిదేళ్లలో జరగబోతున్నట్టు చంద్రబాబు వెల్లడించారు.

రాష్ట్ర ప్రభుత్వం తరఫున భూసేకరణ సమస్యలు లేకుండా చూడాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. అనుకున్నట్టుగా రాష్ట్రంలోని రైల్వేలైను పనులన్నీ కూడా పూర్తయితే.. రవాణారంగం రూపురేఖలు మారుతాయి. మొత్తానికి ఇన్నాళ్లుగా అధ్వానంగా ఉన్న రోడ్లను చంద్రబాబు సర్కారు బాగు చేయడానికి పూనుకుంటే, విజయసాయిరెడ్డి అరిష్టాలు పలుకుతున్నారని ప్రజలు భావిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles