అక్కే కాదు..చెల్లి కూడా నందమూరి హీరోతోనే!

Sunday, December 22, 2024

నందమూరి అభిమానులు ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. సెప్టెంబర్ 6న నందమూరి మోక్షజ్ఞ పుట్టినరోజు నాడు నందమూరి నాలుగో తరం నటుడిగా టాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్నాడు అనే ఊహాగానాలు మొదలు అయ్యాయి. హనుమాన్ సినిమాను తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ, మోక్షజ్ఞ మొదటి సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడని సమాచారం. ఈ సినిమాను 6న పూజా కార్యక్రమంతో మొదలు పెట్టబోతున్నారని, బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని ఈ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించనున్నారని అంటున్నారు.

 నిజానికి నందమూరి మోక్షజ్ఞ అరంగేట్రం ఖాయమైనప్పటి నుండి మీడియాలో రకరకాల ఊహాగానాలు, కథనాలు వస్తూనే ఉన్నాయి. నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశానికి రెడీ అవుతున్నాడు. ఆయన సినిమా అధికారిక ప్రకటన తేదీ దగ్గర పడుతుండడంతో హీరోయిన్ ఎంపికపై ఊహాగానాలు కూడా మొదలు అయ్యాయి.

దర్శకుడు ప్రశాంత్ వర్మ కథానాయికగా ఖుషీ కపూర్‌ని ఎంపిక చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ఇప్పటికే దేవర, రామ్ చరణ్ 16 అనే రెండు పెద్ద సినిమాల్లో నటిస్తుండడంతో శ్రీదేవి కూతుళ్ల క్రేజ్ ఎలాంటిదో ఈపాటికే అర్థం అయిపోతుంది.

ఇప్పుడు మోక్షజ్ఞ సినిమాలో ఖుషీ కపూర్‌ని హీరోయిన్ గా ఎంపిక చేస్తున్నారనే ప్రచారాలు మొదలయ్యాయి. అయితే అసలు విషయం నిజమేనా? కాదా? అని తెలుసుకునే ప్రయత్నాలు చేయగా మేకర్స్ ఇంకా ఖుషీ కపూర్‌ని సంప్రదించలేదని సమాచారం. అంటే ఆమె ఇంకా మూవీ టీమ్‌ కి ఎలాంటి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వలేదని తెలుస్తుంది.

కాబట్టి ఆమె కథ విని, ఆమె తండ్రి బోనీ కపూర్ కూడా కథను  విని ఫైనల్ చేయాలి. అప్పుడు వారు గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే ఆమె హీరోయిన్ గా తెలుగులోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయమవుతుంది. అయితే ఈ కాంబో మాత్రం సాలిడ్ గా ఉండడంతో ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles