వారికి నో హోప్ : ఏపీ కాంగ్రెస్‌లో షర్మిల ఏకాకేనా?

Sunday, July 7, 2024

ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రవిభజన నాడే చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీ మళ్లీ పునరుజ్జీవం అవుతుందని, బతికి బట్ట కట్టుతుందని ఆ పార్టీఢిల్లీ పెద్దలకు ఇసుమంతైనా నమ్మకం లేదు. పార్టీ ఒక్క సీటునైనా గెలుస్తుందని గానీ, పార్టీ పునర్ వైభవానికి ఈ ఎన్నికలు పునాది అవుతాయని వారు అనుకోవడం లేదు. అలాగే.. పీసీసీ చీఫ్ష్ షర్మిల తప్ప ఏ ఒక్కరూ డిపాజిట్ సాధించగలరనే ఆశ కూడా వారికి లేదు. దానికి తగ్గట్టుగానే ఏపీలో ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ పెద్దలు చులకనగా చూస్తున్నారని.. ఏపీలో ప్రచారానికి ఒక గంట వెచ్చించినా దండగ అని అనుకుంటున్నారని పలువురు భావిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా నమ్మకం పోయిందా, లేదా, ఆశ కూడా సన్నగిల్లిపోయిందా? ఆ పార్టీ ఢిల్లీ పెద్దలు అసలు ఏపీలో జరుగుతున్న ఎన్నికలతో తమకు సంబంధమే లేదన్నట్టుగా ఇగ్నోర్ చేయడం ఇప్పుడు రకరకాల అనుమానాలను కలిగిస్తోంది.

ఏపీలో వైఎస్ షర్మిల చేతిలో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు పెట్టారు. గత పదేళ్లలో ఏ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కూడా చేయని విధంగా.. షర్మిల ఆ అవకాశాన్ని చాలా బాగా వినియోగించుకుంటున్నారు. చాలా కష్ట పడుతూ వచ్చారు. రాష్ట్రమంతా తిరిగి పార్టీకి ఒక ఊపు తీసుకువచ్చారు. ఎన్నడూ చచ్చిపోయిందనుకున్న పార్టీకి అస్తిత్వం ఉన్నదని చాటిచెప్పారు. తాను కడప ఎంపీగా బరిలోకి దిగి.. అన్నయ్య జగన్మోహన్ రెడ్డికి చెమటలు పట్టించారు. అవినాష్ రెడ్డి హంతకుడు అనే మాట విస్తృతంగా జనబాహుళ్యంలోకి వెళ్లేలాగా షర్మిల పనిచేశారు. అయితే ఆమెకు మద్దతుగా ఏపీలో కనీసం ఒక్క ప్రచార సభ నిర్వహించడానికైనా రాహుల్, ప్రియాంక వంటి పార్టీ పెద్దతలలు రాకపోవడం విశేషం. తాము వచ్చినా సరే అక్కడ పార్టీ గెలవదని భయపడ్డారో ఏమో తెలియదు.

షర్మిల కనీసం కడప ఎంపీగా పోటీచేస్తున్న తనకు అనుకూలంగా అయినా.. రాహుల్, ప్రియాంక వంటి పెద్ద నాయకులు వచ్చి ప్రచారం నిర్వహిస్తే బాగుండునని ఆశపడ్డారు. పార్టీలో తనకు పెద్దదిక్కుగా ఉన్న కర్నాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ ద్వారా కూడా రాయబారం నడిపారు. అయినా సరే పెద్దనేతలు కాదు కదా, కనీసం డికె కూడా ప్రచారానికి రాలేదు. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం పెద్దలు.. ఏదో ఒక ఆలోచనతోనే, ఏపీ ఎన్నికలను ఏమాత్రం పట్టించుకోలేదని ప్రజలు అనుకుంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles