తమ్ముడి కోసం పెద్ద సాహసమే చేస్తున్న నితిన్‌!

Saturday, May 4, 2024

టాలీవుఎడ్‌ యంగ్‌ హీరో నితిన్‌ చాలా కాలం నుంచి హిట్‌ సినిమాల కోసం ఎదురు చూస్తున్నాడు. చాలా రోజుల నుంచి నితిన్‌ ఖాతాలో సరైన సినిమానే పడలేదు.  గతంలో ఎక్స్టార్డినరీ మ్యాన్‌ అనే సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఆ సినిమా భారీ డిజాస్టర్ అయ్యింది.. దాంతో గత కొంతకాలంగా గ్యాప్ తీసుకున్న నితిన్ ఇప్పుడు మరో రెండు కొత్త సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉన్నాడు.

ప్రస్తుతం నితిన్‌ ఆశలన్నీ రాబిన్‌హుడ్‌, తమ్ముడు చిత్రాలపైనే పెట్టుకున్నాడు.  రాబిన్‌హుడ్‌ సినిమా వెంకీకుడుముల దర్శకత్వంలో రూపొందుతుంది. దీంతో పాటు వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో `తమ్ముడు సినిమాను తెరకెక్కిస్తున్నాడు. తమ్ముడు సినిమా కథ సరికొత్తగా ఉండబోతున్నట్లు విడుదలైన పోస్టర్లను చూస్తేనే అర్థమవుతుంది. తాజాగా ఈ సినిమా నుంచి  నితిన్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

 ఆ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. .ఈ సినిమా నుంచి తాజాగా ఓ వార్త చక్కర్లు కొడుతుంది. శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమాలో నితిన్ పై భారీ యాక్షన్‌ సీక్వెన్స్ ని చిత్రీకరిస్తున్నారట. నేటి నుంచే ఈ యాక్షన్‌ ఎపిసోడ్‌ ప్రారంభమైనట్టు తెలుస్తుంది.

ఈ యాక్షన్‌ సన్నివేశం సినిమా మొత్తానికే హైలెట్‌ నిలవనుందని తెలుస్తుంది. దీని కోసం ఏకంగా 10 రోజుల పాటు షెడ్యూల్‌ ను సెట్‌ చేశారు. అంతేకాకుండా కేవలం ఈ ఫైట్ సీన్ కోసమే సుమారు ఎనిమిది కోట్ల బడ్జెట్ ను పెట్టనున్నట్లు సమాచారం. ఈ సినిమా లో నితిన్‌కి ఇద్దరు హీరోయిన్లుంటారని సమాచారం.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles