ఆ టాలీవుడ్‌ స్టార్ హీరో ప్రాజెక్టులో నిఖిల్ పాన్ ఇండియా మూవీ!

Wednesday, January 22, 2025

టాలీవుడ్ యంగ్‌ నటుడు నిఖిల్‌ కార్తీకేయ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు..ఆ తరువాత వచ్చిన కార్తీకేయ 2 సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాడు. ప్రస్తుతం నిఖిల్, కృష్ణమాచారి దర్శకత్వంలో బిగ్గెస్ట్ పిరియాడిక్ మూవీ ‘స్వయంభు’ సినిమా ఫూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇందులో సంయుక్తా మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా చేస్తున్నారు.

అయితే ఈ సినిమా అక్టోబర్ 15న థియేటర్స్‌లో పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ కానుంది.ఇప్పటికే విడుదల అయిన అప్డేట్స్ అన్ని మూవీపై అంచనాలను పెంచేయడంతో అంతా ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, నిఖిల్ ఓ పాన్ ఇండియా సినిమాకు జెండా ఊపినట్లు సమాచారం. అది కూడా టాలీవుడ్ స్టార్ హీరో చరణ్ నిర్మాణంలో ‘ది ఇండియన్ హౌస్’ అనే పేరుతో రూపుదిద్దుకోబోతుందని తెలుస్తోంది. అంతేకాకుండా దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు హంపిలోని విరూపాక్ష దేవాలయంలో నిర్వహించినట్లు సమాచారం. ఈ సినిమాకు రామ్ వంశీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles