నవీన్‌ పొలిశెట్టి ఆగిపోలేదు..కానీ!

Tuesday, April 1, 2025

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ కథానాయికల్లో  ఎంటర్టైనింగ్ జాతి రత్నం నవీన్ పోలిశెట్టి కూడా ఒకరు. తనదైన ప్రామిసింగ్ పెర్ఫామెన్స్ సినిమాలతో మంచి హిట్స్ అందుకుంటున్న ఈ యంగ్ హీరో నుంచి ఎప్పుడో ప్రకటించిన సినిమా “అనగనగా ఒక రాజు” కూడా ఒకటి. దర్శకుడు కళ్యాణ్ శంకర్ తో మేకర్స్ సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు ప్రకటించిన సంగతి తెలిసిందే.

మరి పెళ్లి బ్యాక్ డ్రాప్ లో ప్లాన్ చేసిన ఈ సినిమా ఆ తర్వాత పెద్దగా ఈ  సినిమా గురించి పెద్దగా వినపడలేదు. కానీ ఫైనల్ గా ఈ పెళ్లి ఆగిపోలేదు జరుగుతుంది అంటూ ఓ ప్రీ వెడ్డింగ్‌ టీజర్ ప్రోమోతో మేకర్స్ చెప్పారు. మరి డిసెంబర్ 26న వెడ్డింగ్ టీజర్ తీసుకొస్తున్నట్లు కన్ఫర్మ్ చేశారు కానీ ఈ సినిమా విషయంలో ఎక్కడా దర్శకుడు పేరు లేకుండా సెట్ చేయడం గమనార్హం.

పోస్టర్ లో కానీ టీజర్ లో కానీ సోషల్ మీడియా పోస్ట్ లో కూడా ఎక్కడా దర్శకుడు పేరు కనపడ లేదు. కేవలం హీరో, నిర్మాణ సంస్థల పేర్లు మాత్రమే ఉన్నాయి. దీంతో ఇపుడు కొత్త ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. కనీసం టీజర్ లో అయినా ఉంటుందో లేదో చూడాలి మరి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles