మళ్లీ కలిసిన నాని విజయ్‌ దేవరకొండ!

Sunday, December 7, 2025
మళ్లీ కలిసిన నాని విజయ్‌ దేవరకొండ! టాలీవుడ్ లో ఉన్నటువంటి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో నాచురల్ స్టార్ నాని అలాగే సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండలు కూడా ఒకరు. ఒకప్పుడు ఇద్దరు కలిసి ఓ సినిమాలో కూడా నటించారు. అయితే ఈ చిత్రం తర్వాత ఇద్దరూ తమ తమ సినిమాల్లో మళ్ళీ ఫుల్ బిజీగా అయ్యిపోవడం ఫ్యాన్స్ నడుమ సోషల్ మీడియాలో రచ్చ ఇలా చాలానే గడిచిపోయాయి.

అయితే మళ్ళీ ఫైనల్ గా ఆ అందరికీ ఈ ఇద్దరు యంగ్ హీరోస్ స్వీట్ షాకిచ్చారు. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన క్లాసిక్ హిట్ చిత్రం “ఎవడే సుబ్రహ్మణ్యం” మళ్ళీ రీరిలీజ్ కి వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా మళ్ళీ విడుదల కోసం ఈ యువ హీరోలు ఒక్కటయ్యారు. ఆ సినిమాలో ఒక ఐకానిక్ సీన్ ని రీక్రియేట్ చేసిన పిక్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నాని హిట్ 3 లుక్ లో విజయ్ కింగ్డమ్ లుక్ లో బైక్ మీద కూర్చున్నట్టు కనిపిస్తున్నారు. ఇక వీరితో పాటుగా నంది.. అదే మాళవిక నైర్ కూడా కనిపిస్తుంది. దీనితో ఈ స్పెషల్ పిక్ వైరల్ గా మారింది. ఇక ఈ చిత్రాన్ని కల్కి 2898 ఎడి దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించగా ప్రియాంక దత్, స్వప్న దత్ లు నిర్మాణం వహించారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles