చిరుతో నాగిని..పిక్‌ అదిరింది..!

Tuesday, December 9, 2025

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న విజువల్ గ్రాండియర్ మూవీ “విశ్వంభర”పై అంచనాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. భారీ బడ్జెట్‌తో దర్శకుడు వశిష్ఠ రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల బాలీవుడ్ నటి మౌని రాయ్ సెట్లో కనిపించడంతో స్పెషల్ సాంగ్ ఉండబోతుందన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి.

ఇప్పుడు వాటికి మరో ముద్ర పడింది. స్వయంగా మౌని రాయ్ తన సోషల్ మీడియాలో చిరంజీవితో కలిసి ఉన్న ఫోటోలను పంచుకుంది. విశ్వంభర షూటింగ్‌లో మెగాస్టార్‌తో కలిసి పనిచేయడం తనకెంతో సంతోషంగా ఉందని తెలిపింది. డాన్స్ మాస్టర్ గణేష్ ఆచార్య నేతృత్వంలో రూపొందుతున్న ఈ ప్రత్యేక గీతం కోసం తాను ఎంతో ఉత్సాహంగా ఉందని చెప్పింది. సినిమాటిక్‌గా ఓ వైపు ఈ చిత్రంలో గ్రాఫిక్స్‌ పనులు కొనసాగుతుండగా, మరోవైపు పాటల చిత్రీకరణతో షూటింగ్ జోరుగా సాగుతోంది.

మౌని రాయ్ ఈ చిత్రంలోని ప్రత్యేక గీతంలో కనిపించబోతున్నట్టు స్పష్టమవుతున్న నేపథ్యంలో ఈ సాంగ్‌పై అభిమానుల్లో కొత్త ఆసక్తి నెలకొంది. అయితే పాట రిలీజ్ తేదీపై మాత్రం ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles