అక్కినేని యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అక్కినేని నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా యువ దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన హిట్ చిత్రం “తండేల్”. కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా అందులో కల్పిత ప్రేమకథను జోడించి క్రేజీ హిట్ ని మేకర్స్ అందుకున్నారు. అయితే ఈ చిత్రం అనుకున్న టార్గెట్ ని రీచ్ అవ్వడమే కాకుండా మేకర్స్ కి సాలిడ్ ప్రాఫిట్స్ కూడా థియేట్రికల్ గా అందించినట్టుగా టాక్ స్ప్రెడ్ అవుతుంది.
దీనితో తండేల్ థియేట్రికల్ గా 14 కోట్లకి పైగా టేబుల్ ప్రాఫిట్ అందించినట్టుగా తెలుస్తుంది. దీనితో తండేల్ గట్టి విజయాన్నే సొంతం చేసుకుంది అని చెప్పాలి. ఇప్పటికీ వీకెండ్స్ లో డీసెంట్ బుకింగ్స్ ని ఈ చిత్రం అందుకుంటుంది. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.