కల్కి కథను చెప్పబోతున్న నాగ్ అశ్విన్‌..రెడీ గా ఉండండి మరి!

Thursday, December 26, 2024

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ నటించిన కల్కి  2898 AD ” సినిమా  కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు .ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించాడు.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్‌ ముద్దుగుమ్మ లు దీపికా పదుకోన్ ,దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ,కమల్ హాసన్ వంటి లెజెండరీ నటులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలలో యాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా నుండి మేకర్స్ తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెంచేసింది. ఈ సినిమాలో దర్శకుడు నాగ్ అశ్విన్ ఓ అద్భుతమైన ప్రపంచాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకుని రానున్నాడు. ఈ సినిమా చూసేటప్పుడు ప్రేక్షకులకి సరికొత్త ప్రపంచంలోకి వెళ్తున్నామని అనుభూతి కలుగుతుందని దర్శకుడు నాగ్ అశ్విన్ తెలిపారు.

ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి నాగ్ అశ్విన్ ఆసక్తికర విషయాలు తెలియజేసాడు.”కల్కి కథ అన్నింటికీ క్లైమాక్స్.. ఎప్పుడూ అన్ని వెస్ట్ లోనే జరగాలా ? ఈ కథ ఎలా వెళ్తుంది అనేది ప్యూర్ క్రియేటివ్ ఇమాజినేషన్ ” అని ఈ చిత్రం కథ గురించి చెప్పుకొచ్చారు.మంగళవారం సాయంత్రం 4 గంటలకు కల్కి జర్నీకు సంబంధించి ఫస్ట్ ఎపిసోడ్ ను విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ప్రస్తుతం ఈ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles