నా భర్త ఫెయిల్యూర్‌ హీరో కాదు..నటి ఎమోషనల్‌ కామెంట్స్‌!

Sunday, December 22, 2024

తెలుగు చిత్ర పరిశ్రమలోకి హ్యాపీడేస్, కొత్త బంగారు లోకం, ఏమైంది ఈ వేళ అంటూ వరుస సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో వరుణ్‌ సందేశ్‌. అయితే గత కొన్ని సంవత్సరాలుగా వరుణ్‌ చెప్పుకోదగ్గ సినిమాలేవి చేయడం లేదు. వరుణ్‌ తన భార్య వితికా తో కలిసి బిగ్ బాస్ లోకి వెళ్లి వచ్చాక అరాకొరా సినిమాలు చేసినా వాటితో అనుకున్న సక్సెస్ అందుకోలేకపోయాడు. అయినా కూడా విభిన్న కథలు ఎంచుకొని సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాడు.

అలా చేసిన సినిమానే ‘నింద’.  రాజేశ్‌ జగన్నాధం దర్శకత్వంలో వరుణ్ సందేశ్ హీరోగా నటించిన నింద సినిమా జూన్‌ 21న థియేటర్లలోకి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈక్రమంలోనే ఆదివారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఇందులో వరుణ్ సందేశ్ భార్య వితికా తన భర్త ఫెయిల్యూర్ హీరో కాదని, తాను నటుడిగా ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదని ఎమోషనల్ కామెంట్లు  చేసింది. వరుణ్‌ సినిమా ఫంక్షన్స్‌కు నేను రానని చెప్పేదాన్ని. చాలారోజుల తర్వాత వరుణ్‌ కోసం ఈ ఈవెంట్‌కు నాకు రావాలనిపించింది. నింద సినిమా కోసం వరుణ్‌ ఎన్నో వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నాడు. ఆ విశేషాలన్నీ రోజూ ఇంటికొచ్చి చెప్తుండేవాడు.

అయితే చాలామంది రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు. మీరు చాలా ఫెయిల్యూర్స్‌ చూశారు కదా.. నటుడిగా ఫెయిలయ్యారు. సినిమా అవకాశాలు కూడా పెద్దగా రావడం లేదు అని మాట్లాడుతున్నారట.. వరుణ్‌ నటుడిగా ఎన్నడూ ఫెయిల్‌ అవలేదు. అతడు ఫెయిల్యూర్‌ యాక్టర్‌ కాదు. ఏ బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి గత 17 ఏళ్లుగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఎవరైతే ఇక సినిమాలు వద్దనుకుని అన్నీ సర్దేసుకుని వెళ్లిపోతారో వాళ్లు మాత్రమే ఫెయిల్యూర్‌ యాక్టర్స్‌. వరుణ్‌ సినిమాలు చేస్తున్నాడు, ఇక ముందు కూడా సినిమాలు చేస్తూనే ఉంటాడు” అంటూ వితికా చెప్పుకొచ్చింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles