నా కెరీర్‌ లోనే బెస్ట్ పాత్ర ఇది అంటున్న ముద్దుగుమ్మ!

Sunday, June 23, 2024

కోలీవుడ్‌ స్టార్‌  అండ్‌ సెన్సేషనల్‌ దర్శకుడు శంకర్‌ డైరెక్షన్‌ లో లోక నాయకుడు కమల్‌ హాసన్‌ హీరోగా చేస్తున్న తాజా చిత్రం ఇండియన్‌ 2. ఇది 90లలో వచ్చిన భారతీయుడు సినిమాకి సీక్వెల్‌ గా రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే పోస్టర్స్‌, టీజర్‌ విడుదల అయ్యాయి. వాటికి మంచి రెస్పాన్స్‌ రావడంతో కొద్ది రోజుల క్రితం పాటలు కూడా విడుదల చేశారు.

యంగ్‌ అండ్‌ టాలెంటెడ్‌ మ్యూజిక్‌ అనిరుధ్‌ కంపోజ్‌ చేసిన పాటలు సినిమా పై భారీ అంచనాలు పెంచుతున్నాయి. ఈ సినిమా జులై 12న విడుదల కాబోతుంది. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ ఓ కీలక పాత్ర పోషించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె సినిమాలో తన పాత్ర గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

తాజా ఇంటర్వ్యూలో రకుల్మా సినిమాలో తన పాత్ర గురించి మాట్లాడుతూ..” నా కెరీర్‌లోనే ‘ఇండియన్‌-2’ బెస్ట్‌ సినిమా అవుతుంది. ఇందులో నా పాత్ర అంత గొప్పగా ఉంటుంది. నా నిజ జీవితానికి దగ్గర పోలిక ఉంది. ఎంతో ఆత్మవిశ్వాసం ఉన్న మహిళగా కనిపిస్తాను. ఇప్పటి వరకు నా కెరీర్‌ లో ఇలాంటి పాత్రలో నటించలేదు. శంకర్‌ వంటి అగ్ర దర్శకులతో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను.

ఈ సినిమా విశేషాలను మీతో పంచుకోవాలని చాలా ఆసక్తిగా ఉంది. దానికి ఇంకా సమయం పడుతుంది” అంటూ చెప్పుకొచ్చింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles