వెనక్కి తగ్గిన మిస్టర్‌ బచ్చన్‌ టీం ..విడుదల ఎప్పుడంటే!

Wednesday, July 24, 2024

రవితేజ కొద్ది రోజుల క్రితం నటించిన ఈగల్ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఈ క్రమంలోనే ఎలాగైన తిరిగి తన మార్క్‌ని చూపించాలనుకుంటున్న రవితేజ హారీశ్ శంకర్‌ కాంబోలో చేస్తున్న తాజా చిత్రం మిస్టర్‌ బచ్చన్‌. ఈ సినిమాలో  భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా చేస్తుంది. బాలీవుడ్ లో భారీ హిట్ ను సొంతం చేసుకున్న రైడ్ సినిమాకి  రీమేక్ ఇది. ఈ సినిమాలో రవితేజ బిగ్ బికి పెద్ద ఫ్యాన్ గా కనిపించబోతున్నారు.

ఈ క్రమంలో సినిమా నుంచి విడుదలైన అన్ని అప్డేట్స్ సినిమా పై భారీ అంచనాలను పెంచుతున్నాయి.ఇక ఈ సినిమాను మొదట ఆగస్టు లో విడుదల చేయాలనుకున్నారు. కానీ ఆగస్ట్ లో పుష్ప 2 విడుదల అవుతుండడంతో మరో విడుదల తేదీ ని  ఫిక్స్ చేసారు మేకర్స్. సెప్టెంబర్ 27న ఈ చిత్రం రిలీజ్ కు డేట్ ఫిక్స్ చేస్తున్నట్లు సమాచారం. కానీ అదే రోజు ఎన్టీఆర్ దేవర ఉండటంతో మరోసారి సినిమాని  పోస్టుపోన్ చేస్తారు అని అనుకుంటున్నారు.

 ‘మిస్టర్‌ బచ్చన్‌..నామ్‌ తో సునా హోగా’ అని సినిమాలో రవి చెప్పిన డైలాగ్‌ ఇప్పటికే జనాల్లోకి బాగా చేరిపోయింది. అవినీతికి వ్యతిరేకంగా నిజాయితీపరుడైన ప్రభుత్వ అధికారిగా రవితేజ ఈ సినిమాలో కనిపించబోతున్నారు. మిస్టర్ బచ్చన్ లక్నో, కారైకుడి,  హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంది. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles