క్లైమాక్స్ లో అందరూ పోతారంటున్న మూవీ మేకర్స్‌!

Saturday, December 21, 2024

ఐకాన్‌ స్టార్‌, జాతీయ నటుడు అల్లు అర్జున్‌ నటిస్తున్న తాజా  సెన్సేషనల్ సినిమా ‘పుష్ప-2’ గురించి  ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో తెలిసిన విషయమే. ఈ సినిమాను క్రియేటివ్ జీనియస్ సుకుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా బాక్సాఫీస్‌ వద్ద దూసుకుపోవడం  ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

ఇక ఈ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ షూటింగ్ ఇటీవల పూర్తయిన సంగతి తెలిసిందే. అయితే, ఓ అభిమాని ఈ క్లైమాక్స్ షూట్ ఎలా వచ్చిందని చిత్ర బృందాన్ని అడగగా…దానికి ‘పుష్ప-2’ మేకర్స్ ఇంట్రెస్టింగ్‌గా సమాధానం చెప్పారు. నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ మూవీ ‘సరిపోదా శనివారం’ నుంచి ‘‘పోతారు.. మొత్తం పోతారు..’’ అనే డైలాగ్‌తో ‘పుష్ప-2’ మేకర్స్ ఇచ్చిన క్లారిటీ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది..

మొత్తానికి ‘పుష్ప-2’ మూవీ క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతుందని.. ఈ సినిమాతో అభిమానులకు పూనకాలు రావడం ఖాయమని వారు పెద్ద హింటే ఇచ్చారు. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ మరోసారి తన విధ్వంసకరమైన పర్ఫార్మెన్స్‌తో ఆడియెన్స్‌ను ఆకట్టుకోనుండగా, అందాల భామ రష్మిక మందన్న మరోసారి తన నటనతో అలరించనుంది. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles