ఫైనల్‌ స్టేజ్‌ కి చేరుకున్న మెగా ప్రిన్స్‌ మట్కా!

Saturday, April 12, 2025

మెగా కుటుంబం నుంచి వచ్చిన హీరోల్లో వరుణ్‌ తేజ్‌ కూడా ఒకరు. వినూత్న సినిమాలను చేస్తూ అందరినీ అలరించడానికి ప్రయత్నిస్తుంటాడు. వరుణ్ తేజ్ హీరోగా తాజాగా దర్శకుడు కరుణ కుమార్ తెరకెక్కిస్తున్న మూవీ “మట్కా” కూడా ఒకటి. మరి ఈ సినిమా షూటింగ్ భారీ బడ్జెట్ తో శరవేగంగా తెరకెక్కిస్తుండగా ఇప్పుడు ఈ చిత్రం ఫైనల్ స్టేజ్ లోకి వచ్చేసినట్టుగా సమాచారం.

ప్రస్తుతం మేకర్స్ ఫైనల్ షెడ్యూల్ ని హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో మొదలు పెట్టారని తెలుస్తుంది. ఈ షూటింగ్ తో సినిమా పూర్తి అయిపోతుంది అని తెలుస్తుంది. ఇందులో పలు కీలక సన్నివేశాలు తెరకెక్కించనుండగా మరిన్ని అప్డేట్స్ ప్రేక్షకుల ముందు రానున్నాయి. ఇక ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహిలు హీరోయిన్స్ గా నటిస్తుండగా వైరా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం వహిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా భాషల్లో విడుదల కానుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles