మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజాగా ‘మట్కా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాపై భారీ నమ్మకాలు పెట్టుకున్నాడు ఈ హీరో. అయితే, సినిమా అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ దగ్గర ‘మట్కా’ డిజాస్టర్‌గా మిగిలింది. ఇక ఈ సినిమా తరువాత వరుణ్ తేజ్ ప్రస్తుతం బ్రేక్ తీసుకుంటున్నాడని అందరూ అనుకున్నారు.
కానీ, వరుణ్ తేజ్ ప్రస్తుతం హనుమాన్ దీక్షలో ఉన్నట్లు సమాచారం. వరుణ్ ప్రస్తుతం హనుమాన్ మాల ధరించాడు. తాజాగా ఆయన ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న సన్నిధిలో ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరుణ్ ఈ హనుమాన్ మాల తొలిసారి ధరించాడు. అందుకే ఆయన ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారని సమాచారం.
ఇక తన తరువాత చిత్రాన్ని దర్శకుడు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కించేందుకు వరుణ్ తేజ్ సిద్దమవతున్నాడు. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుండగా, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌ను మొదలు పెట్టేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుంది.