దీపావళి టపాసులతో వచ్చేస్తున్న మాస్‌ మహారాజా!

Tuesday, January 21, 2025

మాస్ రాజా రవితేజ తన కెరీర్‌లోని ప్రెస్టీజియస్ 75వ చిత్రాన్ని ఇప్పటికే ప్రారంభించగా, ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. భాను బోగవరపు డైరెక్షన్‌లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఓ సాలిడ్ అప్డేట్‌ను మేకర్స్ దీపావళి కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

రవితేజ  75వ చిత్రానికి సంబంధించిన టైటిల్,   ఫస్ట్ లుక్ పోస్టర్‌ను అక్టోబర్ 30న సాయంత్రం 4.05 గంటలకు అభిమానుల ముందుకు తీసుకుని వస్తున్నట్లు ఓ సాలిడ్ పోస్టర్ ద్వారా తెలిపారు. ‘మనదే ఇదంతా’ అనే క్యాప్షన్‌తో రెండు వేళ్ల మధ్య సిగరెట్ పట్టుకున్న పోస్టర్‌ను చిత్ర యూనిట్ రివీల్ చేసింది. ఈ దీపావళికి మాస్ టపాసులు అందరినీ సర్‌ప్రైజ్ చేయడం ఖాయమని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమాలో అందాల భామ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోండగా భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నాడు. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles