యంగ్ , అండ్ టాలెంటెడ్ హీరో నరేష్ అగస్త్య, సంజనా సారథి జంట కలయికగా తెరకెక్కుతున్న రమణ స్వామి చిత్రం ‘మరొక్కసారి’. సీ.కే. ఫిల్మ్ మేకర్స్ బ్యానర్‌పై బి. చంద్రకాంత్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు నితిన్ లింగుట్ల కథ, మాటలు, దర్శకత్వం అందిస్తున్నారు. షూటింగ్ మొత్తం పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు..
ఈ చిత్రకు భరత్ మాంచి రాజు సంగీతం అందించగా, మొత్తం ఆరు పాటలు సిద్ధమయ్యాయి. టాలీవుడ్‌లో పేరున్న గాయకులు కార్తిక్, ప్రదీప్ కుమార్, దేవన్ ఏకాంబరం, జాస్సీ గిఫ్ట్ వాయిస్ అందించిన పాటలు ఇప్పటికే రికార్డింగ్ పూర్తి చేసుకున్నాయి. పాటలతో పాటు వీటికి సంబంధించిన విజువల్స్ కూడా పూర్తి అయ్యాయి. అందమైన లవ్ స్టోరీగా రూపుదిద్దుకుంటుంది.
ఈ సినిమా ప్రత్యేకత ఏమిటంటే, ఇప్పటి వరకు ఏ భారతీయ సినిమా కూడా చిత్రీకరించని గురుడోంగ్మార్ సరస్సు వద్ద కొన్ని సన్నివేశాలను షూట్ చేశారు. 5,430 మీటర్ల ఎత్తులో ఉన్న ఆ సరస్సులో షూటింగ్ చేసిన మొట్టమొదటి ఇండియన్ మూవీగా ‘మరొక్కసారి’ గుర్తింపు పొందింది.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతుండగా, టైటిల్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. పోస్టర్‌ను చూస్తే ఇది ఒక హృదయాన్ని హత్తుకునే ప్రేమకథగా రాబోతుందనే ఫీలింగ్ కలుగుతోంది. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.
