అసలేం జరిగిందో చెప్పిన మంచు విష్ణు!

Friday, January 17, 2025

తెలుగు చిత్ర పరిశ్రమలో మంచు వారి ఫ్యామిలీలో జరుగుతున్న రచ్చ గురించి అందరికీ తెలిసిన విషయమే.విలక్షణ నటుడు మోహన్ బాబు అలాగే తన కొడుకు మంచు మనోజ్ ల విషయంలో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు పైగా అయితే ఈ ఘటనలో హీరో అలాగే మా ప్రెసిడెంట్ మంచు విష్ణు ఎంట్రీ ఇవ్వడంతో మరింత  పరిస్థితులు మరింత ఆసక్తికరంగా మారాయి. అయితే ఫైనల్ గా దీనిపై మంచు విష్ణు మాట్లాడారు.

తాను ప్రస్తుతం జరుగుతున్న కాంట్రవర్సీ పై మాట్లాడుతూ.. మా నాన్న గారు చేసిన పెద్ద తప్పు ఏమిటంటే మమ్మల్ని అతిగా ప్రేమించడమే. నిన్న మీడియా వారిపై జరిగిన దాడి కావాలని చేసింది కాదు అందుకు మీడియా మిత్రలు క్షమించాలని విష్ణు కోరాడు. అసలు ఇలా మాట్లాడాల్సి వస్తుంది అనుకోలేదు. మూడు తరాలుగా నాన్నగారు అంటే ఏంటో అందరికీ తెలుసు. నేను లాస్ ఎంజెల్స్ లో కన్నప్ప వర్క్ లో ఉండగా ఈ గొడవ గురించి తెలిసి .. అన్నీ వదులుకుని వచ్చాను.

మా కంటే ముందు మీడియాకు నోటీసులు లీక్ అవుతున్నాయి. దీనిపై నేను పోలీసులతో మాట్లాడతాను… ప్రేమతో గెలవాల్సిన విషయాలపై రచ్చ చేసుకోవడం మంచిది కాదు.మనోజ్ ఆరోపణలపై నేను చెప్పెది ఏమి లేదు. నేను ఇక్కడ ఉంటే ఫిర్యాదుల వరకు వెళ్లన్నిచ్చేవాడిని  కాదు. ఇది  నాన్న గారి ఆస్తి ఆయన ఇష్టం..ఎంతో కష్టపడి స్వయం కృషి తో గొప్ప స్దాయికి ఎదిగిన వ్యక్తి ఆయన.

ఈరోజున మాకిచ్చే లభించే గౌరవం ఆయనవల్లే.. మోహన్ బాబు పిల్లలుగానే‌. కుటుంబం పరంగా నాన్న గారు ఏది అనుకుంటే అదే జరగాలి. అలాగే వీరి ఇష్యూలో కీలకంగా వినిపిస్తున్న వ్యక్తి వినయ్ గురించి కూడా విష్ణు మాట్లాడారు. వినయ్ గారు నాకు అన్న లాంటి వారు. ఆయన ఎవరిపైనా చేయి చేసుకోలేదు. వినయ్ కు నాకు 15 ఏళ్ల నుంచి పరిచయం ఉంది. ఇండియాలోనే గొప్ప స్దాయి ఉన్న వ్యక్తి అని విష్ణు పేర్కొన్నాడు మా అక్కకు, నాకు భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ, తాను కొట్టినా తిట్టినా నేను పడతాను. తను నా అక్క అని తెలిపాడు.

మా కుటుంబంలో బయటి వ్యక్తులు జోక్యం ఉంటే వారికి రాత్రి వరకుసమయం ఇస్తున్నాం. వెంటనే బయటకు పొండి. మా నాన్న చెప్పిందే వేద వాక్కు. ఆయన చెప్పింది నేను చెస్తాను.సమయమే అన్ని సమస్యలకి సమాధానం చెబుతుంది. అమెరికా నుంచి ఇక్కడికి వచ్చే క్రమంలో నరకం చూశాను అంటూ  మంచు విష్ణు తన బాధని తెలిపారు. ప్రస్తుతం ఈ ఎమోషనల్ కామెంట్స్ వైరల్‌ అవుతున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles