మంచు మోహన్ బాబు కుటుంబం మళ్లీ మళ్లీ వార్తల్లోకి ఎక్కుతూనే ఉంది. విష్ణు – మనోజ్ మధ్య వివాదం ఇంకా కార్చిచ్చులా కాలుతూనే ఉంది. మంచు ఫ్యామిలిలో అసలేం జరుగుతుంది ?, నిజంగానే తన కుటుంబంలో గొడవలు కారణంగా మనోజ్ ఇబ్బంది పడుతున్నాడా ? అంటూ నెటిజన్లను పోస్ట్ లు పెడుతున్నారు. అయితే, ఆస్తుల పంపకం విషయంలోనే అసలు సమస్య ప్రారంభమైందని టాక్ మరోవైపు వినిపిస్తున్నా.. అది కాదు అంటూ మనోజ్ క్లారిటీ ఇస్తున్నాడు.
అయితే, మంచు లక్ష్మి మనోజ్ ను చూసి ఎమోషనల్ అయిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మెరుగైన విద్యాబోధనలు అందించాలనే లక్ష్యంతో మంచు లక్ష్మి నిర్వహిస్తోన్న సేవా కార్యక్రమం ‘టీచ్ ఫర్ ఛేంజ్’. నిన్న రాత్రి జరిగిన ఈవెంట్‌లో తన సోదరిని సర్‌ప్రైజ్ చేస్తూ మనోజ్ అక్కడికి భార్యతో కలిసి వెళ్లాడు. మనోజ్‌ను చూసిన వెంటనే లక్ష్మి ఎమోషనల్ అయ్యారు. ఆయన్ని ప్రేమగా హత్తుకుని భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.