మహేష్‌- జక్కన్న సినిమా మరింత ఆలస్యం కానుందా!

Saturday, May 18, 2024

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ఈ ఏడాది సంక్రాంతి కానుకగా గుంటూరు కారంతో థియేటర్లలో సందడి చేశాడు. ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మిక్స్ డ్‌ టాక్‌ అందుకుంది. దీంతో మహేష్‌ నెక్స్ట్‌ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే మహేష్‌ తన తరువాత చిత్రం దర్శక ధీరుడు రాజమౌళితో తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆఫ్రికన్‌ ఫారెస్ట్ అడ్వెంచర్‌ నేపథ్యంలో పాన్‌ వరల్డ్‌ చిత్రంగా రూపొందుతుంది.

రాజమౌళి కూడా ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా తరువాత తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా మహేష్‌బాబు కెరీర్ లో 29వ చిత్రంగా తెరకెక్కుతుంది.ఈ సినిమా కోసం మహేష్‌బాబు వర్క్‌షాప్స్‌లో పాల్గొంటున్నారు. సినిమాలో తన పాత్ర కోసం ఆయనని ఆయన కొత్త గా తీర్చిదిద్దుకుంటున్నారు.  ‘ది ఇండియానా జోన్స్‌’ తరహా లో సాగే అడ్వెంచరస్‌ థ్రిల్లర్‌ గా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం.

ఈ సినిమా ను మే 31 న సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా అధికారికంగా ప్రకటించి, జూన్‌ లేదా జూలైలో షూటింగ్‌ మొదలుపెడుతున్నట్లుగా గతంలో వార్తలొచ్చాయి.అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా సెట్స్‌మీదకు వెళ్లేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ముందుగా ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించి సెప్టెంబర్‌లో రెగ్యులర్‌ షూట్‌ను మొదలు పెట్టనున్నట్లు సమాచారం.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles