మహేష్‌ అభిమానులకు అదిరిపోయే న్యూస్‌!

Friday, December 5, 2025

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు నటించే భారీ పాన్ వరల్డ్ అడ్వెంచర్ సినిమా కోసం ఫ్యాన్స్ ఏప్పుడో నుంచో ఎదురుచూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు లెజెండరీ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు జన్మదినం సందర్భంగా మేకర్స్ ఊహించని సర్ప్రైజ్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచారు

మొదట ఎలాంటి అప్‌డేట్ రాదని చాలామంది భావించినా, రాజమౌళి మాత్రం ప్రత్యేకమైన ప్రీ-లుక్ పోస్టర్‌ని విడుదల చేశారు. అందులో మహేష్ బాబు లుక్, ఆయన ధరించిన లాకెట్‌పై కనిపించే రక్తపు మచ్చలు అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తించాయి. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవ్వగా, సినిమా మీద హైప్ మరింత పెరిగింది.

సినిమా నుంచి మొదటి రివీల్ నవంబర్‌లో ఉంటుందని మేకర్స్ స్పష్టంగా చెప్పడంతో, ఈ పుట్టినరోజు మహేష్ ఫ్యాన్స్‌కు మరపురాని వేడుకగా మారింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles