ఇటీవల భారతీయ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన చిత్రంగా యానిమేషన్ ఆధారిత devotional యాక్షన్ డ్రామా ‘మహావతార్ నరసింహ’ పేరు నిలిచింది. ఎక్కువగా ప్రమోషన్ లేకుండా లిమిటెడ్ థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ కొట్టింది.
దర్శకుడు అశ్విన్ కుమార్ రూపొందించిన ఈ చిత్రం మొదటి రోజు నుంచే ఆకట్టుకుంటోంది. మొదట 80 వేలకు పైగా టికెట్లు బుక్ మై షోలో అమ్ముడవ్వగా, ఇప్పుడు వర్కింగ్ డేస్ అయినా మంగళవారం రోజే రెండు లక్షల ముప్పై వేలకిపైగా టికెట్లు అమ్ముడయ్యాయి. ఇది ఆదివారం హాలిడే బుకింగ్స్ కు దగ్గరగా ఉండటం గమనార్హం.
వీకెండ్ ఓవర్ అయినా సినిమా వసూళ్లు తగ్గకుండా కొనసాగుతున్నాయి. వీక్లే రోజుల్లోనూ ఇంత రేంజ్ లో టికెట్లు అమ్ముడవుతున్నాయంటే, ప్రేక్షకులలో ఈ చిత్రంపై ఎంత ఆసక్తి ఉందో అర్థమవుతుంది.
ఈ యానిమేషన్ సినిమాకి సమ్ సి ఎస్ సంగీతం అందించగా, నిర్మాణ బాధ్యతలు హోంబళే ఫిలిమ్స్ మరియు క్లీం ప్రొడక్షన్స్ కలిసి చేపట్టాయి. ప్రేక్షకులకి డివోషనల్ కాన్సెప్ట్ తో యాక్షన్ మూమెంట్స్ ని చూపిస్తూ విభిన్నమైన అనుభూతిని ఈ చిత్రం అందిస్తోంది.
ప్రస్తుతానికి ‘మహావతార్ నరసింహ’ బాక్సాఫీస్ వద్ద నెగటివ్ ట్రెండ్ లేనిది, మంచి మౌత్ టాక్ తో ముందుకు సాగుతోంది. యానిమేషన్ సినిమాలకి ఈ స్థాయిలో రెస్పాన్స్ రావడం ఇండియన్ సినిమా దగ్గర చాలా అరుదు.
