దీపావళికి వస్తున్న లక్కీ భాస్కర్‌!

Tuesday, January 21, 2025

టాలీవుడ్‌ లో ఇప్పటికే మహానటి, సీతారామం లాంటి సినిమాలతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వెంకీ అట్లూరి డైరెక్షన్‌ లో ఈ సినిమా తెరకెక్కింది. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని ఒక పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కించారు. 80-90 లలో ముంబై బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాని నిర్మించారు.

ఈ సినిమా నిజానికి సెప్టెంబర్ 7వ తేదీన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల కావాల్సి ఉంది. అయితే సినిమా వాయిదా వేస్తున్నట్లు తాజాగా సినిమా యూనిట్ ప్రకటించింది. ప్రతి భాషలో అక్కడి లోకల్ ఫ్లేవర్ రావడం కోసం డబ్బింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని,  కంగారుగా సినిమాను తీసుకురావడం కంటే దీపావళి సందర్భంగా అక్టోబర్ 31 వ తేదీన రిలీజ్ చేయడం మంచిదని అప్పటికి వాయిదా వేశామని ప్రకటించింది.

ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఒక పాట అలాగే టీజర్ సినిమా మీద అంచనాలు పెంచేశాయి. ఇప్పుడు ఆ అంచనాలను ఆధారంగా చేసుకుని మరింత పర్ఫెక్ట్ గా సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles