కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీ విష్ణు దసరా సందర్భంగా తన కొత్త చిత్రం కామ్రేడ్ కల్యాణ్‌ని ప్రకటించారు. రిలీజ్ చేసిన గ్లింప్స్ వీడియోలో శ్రీ విష్ణు నక్సలైట్ పాత్రలో కనిపిస్తాడని చూపించబడింది. దీని వల్ల ఈ సినిమా మొత్తం సీరియస్ థీమ్ లో ఉంటుందని అభిమానులు ఊహించుకున్నారు.
కానీ, సినిమా సీరియస్ వాతావరణంతో పాటు హాస్యం కూడా ఉండనుంది. శ్రీ విష్ణు పీపుల్ స్టార్ ఆర్.నారాయణ మూర్తి ఫ్యాన్‌గా కనిపిస్తూ, నారాయణ మూర్తి సినిమాలను చూసి పెరిగిన కుర్రాడు ఎందుకు నక్సలైట్ మారాడు అనేది కథా నేపథ్యంగా ఉంటుంది. మేకర్స్ కామెడీకి ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.
కథ 1992లో ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో జరుగుతుంది. షూటింగ్ ఇప్పటికే సగం పూర్తి అయ్యింది. మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటిస్తుండగా, రాధికా శరత్‌కుమార్ కీలక పాత్రలో, టామ్ చాకో విలన్‌గా కనిపించనున్నారని చిత్ర బృందం వెల్లడించారు.
