జగన్ గ్రహణం పట్టిన ప్రాజెక్టుకు మోక్షం ఇవ్వనున్న లోకేష్!

Monday, December 8, 2025

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వన్నెతెచ్చే.. ఎంతో ఉపయోగకరంగా ఉండే ప్రాజెక్టు అది. 2019 ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ప్రభుత్వమే గనుక ఏర్పడి ఉంటే.. కొన్ని నెలల వ్యవధిలోనే కార్యకలాపాలు ప్రారంభించి.. ఇప్పటికే అయిదేళ్లుగా సేవలందిస్తూ ఉండేది. వేల మందికి ఉపాధికల్పిస్తూ ఉండేది. కానీ.. అనుకోకుండా ఆ ప్రాజెక్టుకు గ్రహణం పట్టింది. ఆ గ్రహణం పేరు జగన్మోహన్ రెడ్డి! ఏర్పాటు పనులన్నీ పూర్తయి.. ప్రారంభోత్సవానికి సిద్ధం అవుతున్న సమయంలో జగన్ అధికారంలోకి రావడం.. వారికి అశనిపాతమైంది. తన చేతుల మీదుగా ప్రారంభించి.. క్రెడిట్ దొంగిలించే అవకాశం ఉన్నప్పటికీ.. జగన్ వారికి సహకరించకుండా.. ముప్పుతిప్పలు పెట్టారు. తీరా అయిదేళ్ల గ్రహణకాలం తొలగిపోయిన తరువాత.. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే.. ఇప్పుడు ప్రారంభోత్సవానికి నోచుకుంటోంది. మంత్రి నారాలోకేష్ చేతులమీదుగా ఈ పర్వం జరగనుంది. ఆ ప్రాజెక్టు మరేమిటో కాదు.. విజయవాడ మల్లపల్లి మోడల్ ఇండస్ట్రియల్ ప్రాజెక్టులో ఏర్పాటుచేసిన అశోక్ లేలాండ్ ఎలక్ట్రికల్ డీజిల్ బస్సుల అత్యాధునిక బాడీ బిల్డింగ్ యూనిట్! బుధవారం సాయంత్రం 5 గంటలకు లోకేష్ దీనిని ప్రారంభించనున్నారు.

మల్లపల్లి  మోడల్ ఇండస్ట్రియల్ కారిడార్ అనేది గత తెలుగుదేశం ప్రభుత్వం కృషి, స్వప్నం. అక్కడ అశోక్ లేలాండ్ కు ప్రభుత్వం భూములు కేటాయించింది. ఎలక్ట్రిక్ బస్ బాడీ బిల్డింగ్ యూనిట్ ను వారు నెలకొల్పారు. దీనిని ప్రారంభించేలోగానే.. జగన్ సర్కారు ఏర్పడింది. వారు ఆ ప్రాజెక్టుకు సహాయ నిరాకరణ చేయడంతో అయిదేళ్లపాటూ అడుగు ముందుకు పడకుండా ఆగిపోయింది.

తీరా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. అశోక్ లేలాండ్ తో సంప్రదించి.. దీని విస్తృతి పెంచారు. ఎలక్ట్రిక్ బస్సులతో పాటు, అన్ని రకాల బస్సులకు బాడీ బిల్డింగ్ చేసేలాగా ప్లాంట్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు. దీనినే ఇవాళ నారా లోకేష్ ప్రారంభించబోతున్నారు. అమరావతి ప్రాంతంలో ప్రారంభం అవుతున్న మొట్టమొదటి ఆటోమొబైల్ ప్లాంటుగా ఇది రికార్డుల్లోకి ఎక్కనుంది.

ఈ ప్లాంటు ఫేజ్ 1 లో 600 మందికి, ఫేజ్ 2 లో 1200 మందికి ఉపాధి కల్పించబోతున్నారు. 75 ఎకరాల్లో విస్తరించిన ప్లాంటులో అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలతో బస్ బాడీ బిల్డింగ్ చేపట్టనున్నారు. బీఎస్ 6 మాడల్ బస్సులను ఉత్పత్తి చేస్తారు. రెండుదశలలో ప్లాంటు కలిపి.. సంవత్సరానికి 2400 బస్సుల ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంటు సేవలందించనున్నట్టుగా తెలుస్తోంది. అశోక్ లేలాండ్ సంస్థ ప్రపంచంలోనే బస్సుల తయారీలో 4వ స్థానంలో ఉంటుంది. ట్రక్కుల ఉత్పతిలో 13వ స్థానంలో ఉంటుంది. అలాంటి సంస్థ రాష్ట్రంలో ఇంత భారీ ప్రాజెక్టు ఏర్పాటుచేయడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles