రాయన్‌ టీమ్‌ కి లోకేష్‌ కనగరాజ్‌ అభినందనలు!

Saturday, December 21, 2024

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో నటించి, దర్శకత్వం వహించిన తాజా సినిమా రాయన్. ఈ సినిమా జులై 26, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రేక్షకులను, అభిమానులని ఆకట్టుకుంటుంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకెళ్తుంది.

 ఈ సినిమా  విజయం అందుకోవడంతో టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. హీరో ధనుష్, సందీప్ కిషన్, కాళిదాస్ లకి, నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ కి మరియు చిత్ర యూనిట్ కి హృదయ పూర్వక అభినందనలు అంటూ సోషల్‌ మీడియా వేదికగా పేర్కొన్నారు.

ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి రెస్పాన్స్ తో ముందుకు దూసుకు పోతుంది. ఎస్.జే.సూర్య, ప్రకాష్ రాజ్, సెల్వ రాఘవన్, జయరామ్, దుషరా విజయన్, అపర్ణ బాలమురళీ, వరలక్ష్మి శరత్ కుమార్, శరవణన్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు విన్నర్ రెహమాన్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles