అమిత్ షా సంకేతాలు: రిపీట్ 2014!

Sunday, December 22, 2024

నారా చంద్రబాబు నాయుడు మీద కక్షపూరిత ప్రతీకార చర్యలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆత్మహత్యా సదృశ్యంగా మారబోతున్నాయా?  ఒకవైపు ప్రజలలో  చంద్రబాబునాయుడు పట్ల పెరుగుతున్న సానుభూతి సంఘీభావం..  అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ దుర్మార్గపు పోకడల పట్ల ఏహ్యభావం, వ్యతిరేకత  కలిసి  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరణ శాసనం లిఖించనున్నాయా? అనే అభిప్రాయం పలువురిలో కలుగుతుంది. 2014 ఎన్నికల నాటి వాతావరణాన్ని,  పార్టీల స్నేహబంధాన్ని,  ఫలితాలను రిపీట్ చేసేలాగా..  హస్తినలో మంత్రాంగం నడుస్తున్నట్లుగా కనిపిస్తోంది.

 కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తో నారా లోకేష్ భేటీ కావడం సాధారణంగా పెద్ద కీలక పరిణామం కాకపోవచ్చు.  చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న నేపథ్యంలో..  ప్రభుత్వ దుర్మార్గాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లడానికి,  తమను ఎన్ని రకాలుగా వేధిస్తున్నారో వివరించడానికి  కలిసినట్లుగా భావించవచ్చు.  అయితే అదే భేటీలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర సారథి పురందేశ్వరి కూడా ఉండడం..  ఇప్పుడు కొత్త చర్చకు అవకాశం ఇస్తోంది.

 జగన్ ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనివ్వబోయేది లేదని పవన్ కళ్యాణ్ తొలి నుంచి చెబుతూనే ఉన్నారు.  తెలుగుదేశంతో తమ పార్టీ జనసేన పొత్తులను ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన ఆయన..  భారతీయ జనతా పార్టీ కూడా తమ ఆలోచనతో కలిసి వస్తుందని ఆశిస్తున్నట్లుగా ప్రతిసారి వెల్లడిస్తున్నారు.  ఆయన మాటలు..  ప్రస్తుతం ఢిల్లీ భేటీలో ప్రతిఫలిస్తున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.  తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్,  ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి.. ఏకకాలంలో భారతీయ జనతా పార్టీ అధిష్టానం లో నిర్ణయాత్మక శక్తి అయిన అమిత్ షా తో భేటీ కావడం ఇందుకు సంకేతంగా కనిపిస్తోంది. 

నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి నాయకులలో కూడా విపక్ష కోటమితో కలిసి పోటీ చేయాలనే కోరిక ఉంది.  దాని వల్ల పార్టీకి అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం దక్కుతుందని వారి కోరిక. అమిత్ షా తో భేటీ తర్వాత, తెలుగుదేశంతో కమల బంధం కూడా ఖరారు అయితే గనుక..  2014 నాటి ఎన్నికల ఫలితాలు పునరావృతం అవుతాయని..  ఇప్పటి ప్రభుత్వం మీద ఉన్న ప్రజా వ్యతిరేకత కూడా తోడైతే గనుక మరింత బంపర్ మెజారిటీతో విపక్ష కూటమి అధికారంలోకి వస్తుందని ప్రజల భావిస్తున్నారు.  పురందేశ్వరి, నారా లోకేష్  ఇద్దరు కలిసి అమిత్ షా తో భేటీ కావడం..  వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తడానికి కారణమవుతుందని ప్రజలు భావిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles