టాలీవుడ్‌లో ఇటీవల విడుదలైన చిన్న సినిమాల్లో ఒకటైన లిటిల్ హార్ట్స్ ప్రస్తుతం హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. మౌళి తనుజ్ ప్రశాంత్, శివాని నాగరం ప్రధాన పాత్రల్లో నటించిన ఈ రొమాంటిక్ కామెడీని సాయి మార్తాండ్ తెరకెక్కించగా, #90s దర్శకుడు ఆదిత్య హాసన్ నిర్మించారు. యువతరాన్ని దృష్టిలో పెట్టుకొని తీసుకొచ్చిన ఈ సినిమా విడుదలైన మొదటి రోజే పాజిటివ్ రిపోర్ట్ తెచ్చుకుంది.
ప్రేక్షకుల నుంచి వచ్చిన మంచి స్పందనతో థియేటర్ల వద్ద రష్ కనిపిస్తోంది. కేవలం రెండు కోట్ల ఖర్చుతో రూపొందిన ఈ సినిమా మూడు రోజుల్లోనే దాదాపు 12.21 కోట్ల గ్రాస్ సంపాదించింది. తక్కువ బడ్జెట్‌తో ఇంత పెద్ద వసూళ్లు రాబట్టడం ట్రేడ్ సర్కిల్స్‌ని ఆశ్చర్యపరిచింది. వీకెండ్ కలెక్షన్స్ అద్భుతంగా ఉండటంతో పాటు సోమవారం కూడా టికెట్ బుకింగ్స్ బలంగానే ఉన్నాయని టీమ్ చెబుతోంది.
ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, జై కృష్ణ, ఎస్ఎస్ కాంచి, అనిత చౌదరి, సత్యకృష్ణన్ వంటి పలువురు కీలక పాత్రలు పోషించారు.
