ఆ హాలీవుడ్‌ సినిమాలా..!

Thursday, December 26, 2024

పాన్ ఇండియా సినిమా హీరో ప్రభాస్ కథానాయకుడిగా చేస్తున్న తాజా సినిమాల్లో యంగ్‌ డైరెక్టర్‌ మారుతీతో చేస్తున్న భారీ సినిమా “ది రాజా సాబ్” కూడా ఒకటి. మరి ఈ సినిమాని మూవీ మేకర్స్ ఒక సాలిడ్ హారర్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తుండగా ఊహించని రేంజ్ వి ఎఫ్ ఎక్స్ వర్క్ తో తాము ఈ సినిమా చేస్తున్నట్టుగా మొదటి నుంచీ చెబుతున్నారు.

అలాగే ఈ సినిమాపై లేటెస్ట్ గా బాలీవుడ్ సినిమా ప్రముఖ ప్రొడ్యూసర్‌ భూషణ్ కుమార్ చేసిన కామెంట్లు ప్రస్తుతం క్రేజీగా మారాయి. తాను ది రాజా సాబ్ లో కొన్ని విజువల్స్ చూడగా ఆ విజువల్స్ హాలీవుడ్ సినిమా హ్యారీ పోటర్ రేంజ్ లో అనిపించాయి అని తెలిపారు. దీంతో రాజా సాబ్ ఈ రేంజ్ లో ఉందా అని  ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇక ఈ భారీ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా  వచ్చే ఏడాది ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చేందుకు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles