మెగా స్టార్‌ 2 సార్లు చూసిన సినిమా ఇదేనంట!

Saturday, December 7, 2024

తెలుగు సినిమా పద్మ భూషణుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇపుడు తాజాగా నటిస్తున్న భారీ సినిమా “విశ్వంభర” గురించి  అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా పనుల్లోనే బిజీగా ఉండగా ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక తాజా గా మెగాస్టార్ మన టాలీవుడ్ వెర్సటైల్ హీరో సత్యదేవ్ యాక్ట్‌ చేసిన తాజా సినిమా జీబ్రా. ఈ సినిమా  ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ కూడా వెళ్లారు.

ఈ సందర్భంగా మెగాస్టార్‌ మాట్లాడుతూ ఈ ఏడాది చాలా చిన్న సినిమాలు అద్భుత విజయాన్ని అందుకున్నాయి. ఆ సినిమాల్లో నేను ఓ సినిమా రెండు సార్లు చూసాను ఎంత బాగుందోఅంటూ కొనియాడారు. ఇంతకీ మెగాస్టార్‌ 2 సార్లు చూసిన ఆ సినిమా ఏదో కూడా కాదు క్రేజీ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ లా వచ్చిన సినిమా “మత్తు వదలరా 2” సినిమానే.

యువ హీరో శ్రీ సింహా, సత్య లు నటించిన ఈ సినిమాని దర్శకుడు రితేష్ రానా రూపొందించాడు. మరి ఈ క్రేజీ హిట్  సినిమానే నే మెగాస్టార్ ఎంతో నచ్చి ఒకటి కాదు రెండు సార్లు చూశానని చెప్పుకొచ్చారు. దీనితో రీసెంట్ టైం లో తనకి ఈ సినిమా ఎంతో ఎంటర్టైన్ చేసి ఉండొచ్చు అని చెప్పాలి.

ReplyForwardAdd reaction

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles