జపాన్‌ లో విశ్వంభర!

Saturday, December 7, 2024

మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటిస్తున్న ‘విశ్వంభర’ సినిమా పై భారీ అంచనాలు మొదలయ్యాయి.  ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ పోస్టర్స్‌తో పాటు టీజర్ గ్లింప్స్ కూడా విడుదల అవ్వడం.. వాటికి ప్రేక్షకుల నుండి సాలిడ్ రెస్పాన్స్ అందడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే, ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన వీఎఫ్ఎక్స్ పనుల్లో సినిమా బృందం ఫుల్  బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అంతేగాక, ఈ సినిమాకు సంబంధించి కొంతమేర షూటింగ్ బ్యాలెన్స్ ఉందంట.. ఈ మిగిలిన షూటింగ్‌ను జపాన్‌లో చిత్రీకరించేందుకు చిత్ర బృందం ప్లాన్‌ చేసిందంట.

దీనికోసం మెగాస్టార్ చిరంజీవి బుధవారం జపాన్ కి వెళ్లినట్లు సినీ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ షెడ్యూల్‌లో చాలా కీలకమైన సీన్స్ తెరకెక్కనున్నాయని.. ఇవి సినిమాకే హైలైట్‌గా ఉండబోతున్నాయని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి దర్శకుడు వశిష్ఠ జపాన్ షెడ్యూల్‌లో ఎలాంటి సన్నివేశాలను ప్లాన్ చేశాడో తెలియాలంటే ఎదురు చూడాల్సిందే. ఇక ఫాంటెసీ అడ్వెంచర్ మూవీగా తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ మూవీలో త్రిష, ఆషికా రంగనాథ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఎంఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. యువి క్రియేషన్స్ బ్యానర్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles