ఆ విషయంలో శ్రీదేవిలానే…జాన్వీ కూడా!

Sunday, December 22, 2024

బాలీవుడ్ యంగ్‌ హీరోయిన్స్‌ లో  జాన్వీ కపూర్ ఒకరు. తాజాగా జాన్వీ లీడ్ రోల్ లో నటించిన సినిమా ‘ఉలఝ్‌’ . జాతీయ అవార్డు గ్రహీత సుధాంశు సరియా ఈ సినిమాని తెరకెక్కించాడు.  గుల్షన్‌ దేవయ్య, రాజేశ్‌ థైలాంగ్‌తోపాటు అదిల్‌ హుస్సేన్‌ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అదిల్‌.. జాన్వీకపూర్‌ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వృత్తిపై ఆమెకున్న అంకితభావాన్ని కొనియాడారు.

‘‘శ్రీదేవి  ఫిల్మోగ్రఫీలో ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్న చిత్రం ‘ఇంగ్లీష్‌ వింగ్లీష్‌’. అందులో నేనూ యాక్ట్‌ చేశాను. ఆ సినిమా సెట్స్‌లోనే తొలిసారి జాన్వీకపూర్‌ను చూశా. అప్పుడు ఆమె వయసు 14 ఏళ్లు. శ్రీదేవితో కలిసి తను రోజూ మూవీ సెట్‌కు వచ్చేది. తన తల్లి యాక్టింగ్‌ను ప్రతిక్షణం గమనిస్తూ ఉండేది. దాదాపు 13 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆమె కథానాయికగా నటించిన ‘ఉలఝ్‌’లో నటించాను.

వృత్తిపట్ల శ్రీదేవికి ఏవిధమైన ఏకాగ్రత, అంకితభావం ఉండేదో.. అదే ఇప్పుడు జాన్వీకపూర్‌లో కూడా చూశాను. దర్శకుడు చెప్పినవిధంగా యాక్ట్‌ చేయడం.. సీన్స్‌ గురించి అడిగి తెలుసుకోవడం.. సెట్‌లో ఉన్నవారందరినీ గౌరవించడం ఇలా ప్రతీ విషయంలో జాన్వీని చూస్తుంటే శ్రీదేవిని చూసినట్లే ఉంది’’ అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles