చంద్రబాబు లాగా మీరు కూడా ఇవ్వవచ్చు కదా!

Wednesday, January 22, 2025

నియోజకవర్గాలలో కొత్త డ్రామాలు ఆడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎక్కడికక్కడ షాక్‌లు ఎదురవుతున్నాయి. చంద్రబాబు నాయుడు చేసినట్లుగా వృద్ధాప్య పెన్షన్లను మీరు కూడా పెంచవచ్చు కదా అంటూ వృద్ధులు వారిని మొహం మీదనే ప్రశ్నిస్తున్నారు. జగనన్న ప్రభుత్వం మళ్ళీ రాకపోతే ఈ పెన్షన్ లు పూర్తిగా ఆగిపోతాయి.. అని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు వృద్ధులను భయపెట్టడానికి ప్రయత్నిస్తుంటే- ‘రాకుండా పోయేదేముంది 1000 రూపాయలు పెరిగి 4వేలు వస్తాయి. మీరు కూడా అలా ఇస్తే బాగుంటుంది కదా’ అని వృద్ధులు వారికి సలహా చెబుతున్నారు. దీంతో ఖంగు తినడం వైసిపి నాయకులు వంతు అవుతోంది.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొత్త ఎత్తుగడ వేసింది. చంద్రబాబు నాయుడు మీద దుష్ప్రచారం సాగించడానికి వాళ్లు నానా పాట్లు పడుతున్నారు. వృద్ధుల పెన్షన్లను బ్యాంకు ఖాతాలలో డిపాజిట్ చేసిన వైసిపి నాయకులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, దాని నుంచి రాజకీయ మైలేజీ ఆశిస్తూ ఉంది. బ్యాంకుల వద్ద పడిగాపులు పడుతూ ఉండే, ఎండల్లో బ్యాంకులకు వస్తుండే వారిని కలిసి మాట్లాడుతూ ఈ కష్టాలు చంద్రబాబు వల్లనే వచ్చాయని చెప్పడానికి వారు ప్రయత్నిస్తున్నారు.

అయితే చంద్రబాబు నాయుడు పేరు మొదలుపెట్టగానే వృద్ధులు ఎదురు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వస్తే మాకందరికీ నాలుగు వేలు ఇస్తారట కదా అని ప్రశ్నిస్తున్నారు. దీంతో వైసిపి నాయకులు అసలు జవాబు చెప్పలేకపోతుండడం విశేషం.

చంద్రబాబును నమ్మలేరు అనే మాటలు చెబుతున్నారు. జగనన్న రాకపోతే నీకు ఈ పెన్షన్లు కూడా రావు అని భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ వృద్ధులతో ఈ తరహా నాటకాలు వర్కౌట్ కావడం లేదు. తాతకు దగ్గులు నేర్పిన  సామెతలు లాగా వారి ఆటలు ఉంటున్నాయి. వృద్ధులు కూడా చాలా తెలివిగా చంద్రబాబు వస్తే నాలుగు వేలు వస్తాయి. ఒకవేళ మాట నిలబెట్టుకోకపోయినా కూడా ఈ మూడు వేల తొలగించడం జరగదు కదా అని అడిగేసరికి బాబు మీద విషం కక్కాలనుకుంటున్న వారికి నోట మాట రావడం లేదు. బ్యాంకులో పెన్షన్లు డిపాజిట్ చేస్తే వృద్ధులతో మరోసారి ప్రాణాలను తీసే గేమ్ ఆడవచ్చు అని అనుకున్న జగన్ సర్కారు కుట్రలకు మరో రకం భంగపాటు ఎదురవుతోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles