పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్ ఊహించని విధంగా అగ్ని ప్రమాదానికి లోనైన సంగతి అందరికీ తెలిసిందే. సింగపూర్ లో చదువుతున్న తన పాఠశాల ఆకస్మికంగా అగ్ని ప్రమాదానికి లోనైన నేపథ్యంలో మార్క్ కి గాయాలు కూడా అయ్యాయి. అయితే వెంటనే తనని అక్కడి హాస్పిటల్ కి తరలించగా లేటెస్ట్ గా అయితే చిరంజీవి సహా పవన్ కుటుంబీకులు మార్క్ కోసం సింగపూర్ పయనమయ్యారు.
మరి ఇపుడు మార్క్ ఆరోగ్యానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ బయటకి వచ్చింది. ప్రస్తుతం మార్క్ అత్యవసర వార్డ్ లోనే చికిత్స పొందుతున్నాడట. ముఖ్యంగా ఊపిరితిత్తులు నడుమ పొగ పట్టేయడం మూలాన వైద్యులు దీనిపై వైద్యం అందిస్తున్నారట. అలాగే నెమ్మదిగా మార్క్ కోలుకుంటున్నాడని మరో మూడు రోజులు పాటు మార్క్ కి వైద్యం కొనసాగనుందని తెలుస్తుంది.