విశ్వంభర తాజా సమాచారం!

Sunday, December 22, 2024

టాలీవుడ్ పద్మ భూషణుడు  మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్ గా యువ దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న భారీ విజువల్ ట్రీట్ మూవీ  “విశ్వంభర”.  చాలా కాలం తర్వాత చిరు చేస్తున్న ఫాంటసీ సినిమా కావడంతో దీని మీద హైప్‌ మెగా ఫ్యాన్స్ లో నెక్స్ట్ లెవెల్లో ఉందనే చెప్పుకొవచ్చు.

అయితే ఈ సినిమా టీజర్ కూడా రీసెంట్ గానే మొదలైంది. ఈ తర్వాత విడుదల కూడా ఎలాగో వాయిదా పడేసరికి మేకర్స్ కి చిన్న బ్రేక్ దొరికింది.

అయితే ఈ గ్యాప్ తర్వాత ఓ షెడ్యూల్ ని జపాన్ లో ప్లాన్ చేసినట్టుగా టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. మరి దీనిపై మరో అప్డేట్ ఇపుడు వినిపిస్తుంది. దీని ప్రకారం ఈ షూట్ లోనే హీరోయిన్ త్రిషతో మంచి డ్యూయెట్ ని ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. మరి స్టాలిన్ తర్వాత మళ్ళీ త్రిష చిరు జోడి జత కట్టబోతుంది. మరి వీరి మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంటుందో వేచి చూడాలి

. ఇక ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతం అందించగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles