తన తొలి హీరోకి థ్యాంక్స్‌ చెప్పిన కుష్బూ!

Friday, December 5, 2025

టాలీవుడ్ స్టార్ హీరోలలో విక్టరీ వెంకటేష్ తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ ను క్రియేట్‌ చేసుకోవాలి. ఫ్యామిలీ ఆడియెన్స్‌కు వెంకటేష్ అంటే ప్రత్యేక అభిమానం. ఆయన నటించిన సినిమాల్లో కుటుంబ కథలు ఎక్కువగా ఉండటంతో మహిళల్లో వెంకటేష్ కు భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్ ఉంటుంది. ఇక తెలుగు సినీ పరిశ్రమకు వెంకటేష్ సరిగ్గా 38 ఏళ్ల క్రితం ఈరోజే పరిచయం అయ్యారు. ‘కలియుగ పాండవులు’ సినిమా ఆగస్టు 14, 1986లో విడుదల అయ్యింది. ఈ సినిమా రిలీజ్ అయ్యి 38 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన ఖుష్బూ తాజాగా కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో వేదికగా పంచుకున్నారు.

తనను సౌత్ ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయం చేసిన తొలి హీరోతో ఆమె కలిసి ఉన్న కొన్ని అరుదైన ఫోటోలను ఆమె తన ఇన్‌స్టా అకౌంట్‌లో పోస్ట్ చేసింది.తన తొలి సౌత్ ఇండియన్ మూవీ విడుదలై 38 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తన హీరో విక్టరీ వెంకటేష్, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు లకు తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని ఆమె ఈ సందర్భంగా పేర్కొంది. తనను సొంత కుటుంబంలోని వ్యక్తిగా ట్రీట్ చేసిన సురేష్ ప్రొడక్షన్స్ తనకు ఎప్పటికీ హోం బ్యానరే అని ఆమె ఈ సంర్భంగా చెప్పుకొచ్చారు.

ఆ సినిమా నుంచి ఇప్పటివరకు తనపై ప్రేమ, అభిమానాలు చూపిస్తున్న తెలుగు ప్రేక్షకులకు ఖుష్బూ కృతజ్ఙతలు తెలిపింది. ఖుష్బూ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles