కోలీవుడ్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున కలిసి నటించిన లేటెస్ట్ సినిమా ‘కుబేర’ ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల్లో మంచి చర్చనీయాంశంగా మారింది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా భావోద్వేగాలతో కూడిన సోషల్ డ్రామాగా తెరకెక్కింది. రిలీజ్ కి ముందు నుంచే సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి కానీ థియేటర్స్ లో విడుదలైన తర్వాత ఆ అంచనాలను దాటి ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తుండగా, యూఎస్ బాక్సాఫీస్ దగ్గర కూడా ఈ మూవీ మంచి ఓపెనింగ్ అందుకుంది. ప్రీమియర్ షోల నుంచే పాజిటివ్ టాక్ చక్కర్లు కొడుతుండగా, తొలి రోజే ఈ చిత్రం అక్కడ సుమారుగా 8 లక్షల డాలర్ల గ్రాస్ ను దాటేసి అందరికీ షాక్ ఇచ్చింది. ఈ పేస్ చూస్తే మొదటి వీకెండ్ లోనే మిలియన్ మార్క్ చేరడం ఖాయం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమా విజయంలో భాగంగా దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం కూడా చాలా హైలైట్ గా నిలిచింది. ఇక నిర్మాణ విషయానికి వస్తే, అమిగోస్ క్రియేషన్స్ మరియు శ్రీ వెంకటేశ్వర సినిమాస్ సంస్థలు కలిసి నిర్మించిన ఈ చిత్రం సాంకేతికంగా కూడా రిచ్ లెవెల్లో ఉండటంతో సినిమా చూసినవారంతా ఆకట్టుకుంటున్నారు.
ప్రేక్షకులను భావోద్వేగంగా తాకే కథ, హీరోల పెర్ఫార్మెన్స్, మ్యూజిక్ అన్నీ కలిసొచ్చిన ఈ చిత్రం ఇప్పటికే మంచి సక్సెస్ ట్రాక్ లో దూసుకుపోతోంది.
