కేటీఆర్.. డబల్ మీనింగ్ డైలాగులు!

Wednesday, January 22, 2025

భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు పాపం.. తన పార్టీని కాపాడుకోవడానికి నానా పాట్లు పడుతున్నారు. పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కరొక్కరుగా కాంగ్రెసులో చేరిపోతున్న తరుణంలో.. పార్టీని కాపాడుకోవడం అనేది ఎవ్వరికైనా చాలా కష్టమే. పాపం.. ఆ కష్టం మొత్తం కేటీఆర్ పడుతున్నారు. చీటికీ మాటికీ.. పార్టీ ఫిరాయిస్తున్న వారందరికీ షాక్ తప్పదని.. ఖచ్చితంగా వారి స్థానాల్లో ఉప ఎన్నికలు వస్తాయని అంటున్నారు. మరో కోణంలోంచి చూసినప్పుడు కేటీఆర్ మాటల్లో అనేకానేక డబల్ మీనింగ్ డైలాగులు కనిపిస్తున్నాయి.

ఎలాగంటే.. ప్రస్తుతం దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి ల పార్టీ ఫిరాయింపుల మీద భారాస హైకోర్టులో పిటిషన్ నడిపిస్తోంది. మరొకవైపు ఈ మూడు స్థానాలకు త్వరలోనే ఖచ్చితంగా ఉప ఎన్నికలు వచ్చేస్తాయని పదేపదే చెబుతున్నారు. ఆయన చెబుతున్న తీరును గమనిస్తోంటే.. పార్టీ మారారంటే.. మీకు కూడా ఇదే గతి.. మీ సీటుకు కూడా ఉపఎన్నిక వస్తుంది అని హెచ్చరిస్తున్నట్టుగా ఆయన మాటలు ఉంటున్నాయి. అలా హెచ్చరించకపోతే.. పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోతుందేమో అనే భయం కూడా ఆయన మాటల్లో కనిపిస్తున్నట్టుగా ఉంది.

డబల్ మీనింగ్ ఏంటంటే.. ఎమ్మెల్యేల ఫిరాయింపుల మీద సుప్రీం కోర్టులో కూడా అప్పీలు చేయబోతున్నట్టుగా కేటీఆర్ ఒకవైపు చెబుతుంటారు. మరొకవైపు హైకోర్టులో ఈ ముగ్గురు ఎమ్మెల్యేల అనర్హత గురించి పిటిషన్ నడుస్తూనే ఉంది. అదే సమయంలో- త్వరలోనే ఈ మూడు స్థానాలకు ఉప ఎన్నిక వచ్చేస్తుందని కూడా ఆయన అంటున్నారు.

అంటే ఏమిటన్నమాట.. హైకోర్టులో పిటిషన్ ఉంది.. ఉప ఎన్నిక వస్తుందని ఒకవైపు అంటూ.. సుప్రీంలో అప్పీలుకు వెళతాం అంటే అర్థమేంటి? హైకోర్టులో ఓడిపోతాం అని కేటీఆర్ కు చాలా నమ్మకం ఉందన్నమాట.
ఏదో పార్టీని కాపాడుకోవడానికి.. మరింత మంది ఎమ్మెల్యేలు తమను వదిలిపోకుండా చూసుకోవడానికి కేటీఆర్ నానా పాట్లు పడుతున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles