నాడు కోడెల గతే.. ఇవాళ జగన్ కు కూడా!

Wednesday, December 25, 2024

2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన తర్వాత.. తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు అందరినీ ఒక రేంజిలో వేధించడం అనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ రోజున మాజీ స్పీకరు కోడెల శివప్రసాదరావును ఎన్ని రకాలుగా వేధించారో అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు రోజులు మారాయి. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆరోజున కోడెల పరిస్థితిలోనే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నారు. కోడెలను వేధించినట్టుగా, ఈయనను కూడా వేధించడానికి రచ్చకీడ్చడానికి ప్రభుత్వానికి ఆస్కారం ఉంది. కానీ.. ప్రభుత్వం మాత్రం చాలా హుందాగా వ్యవహరిస్తోంది.

రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాదులో ఉన్న అసెంబ్లీ అమరావతికి తరలిపోయిన నేపథ్యంలో ఆ ఫర్నిచర్ లో కొంత భాగాన్ని అప్పటి స్పీకరు కోడెల శివప్రసాదరావు తన వ్యక్తిగత కార్యాలయానికి వాడుకున్నారు. 2019లో అధికారం మారిన తర్వాత ఆయన ప్రభుత్వానికి పద్ధతిగా లేఖ రాశారు. ప్రభుత్వం యొక్క ఫర్నిచర్ తన వ్యక్తిగత కార్యాలయంలో ఉండిపోయిందని, దానిని ప్రభుత్వం తీసుకువెళ్లాలని ఆయన కోరారు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆయన లేఖ పట్ల చిత్రంగా స్పందించింది. ఫర్నిచర్ దొంగలించినట్టుగా ఆయన మీద పోలీసు కేసులు పెట్టించింది. దుర్మార్గంగా వ్యవహరించింది. మనస్తాపంతో కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకుని మరణించారు.

నిజానికి ప్రభుత్వ ఫర్నిచర్ ను వాడుకునే విషయంలో అప్పటి కోడెల పరిస్థితిలోనే ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నారు. ఆయన ఇప్పుడు కేవలం ఒక ఎమ్మెల్యే. కానీ.. ఆయన గతంలో ముఖ్యమంత్రిగా ఉండగా.. తాడేపల్లి బంగళాలోనే ఒక భాగం సీఎం క్యాంపు కార్యాలయంగా వాడుకున్నారు. అప్పట్లో ప్రభుత్వం కోట్ల రూపాయల వ్యయంతో ఫర్నిచర్ ఏర్పాటుచేసింది. ఇప్పుడు అక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంగా ఆ భవనం వాడుతున్నారు. ఆ విలువైన ఫర్నిచర్ ను ప్రభుత్వానికి అప్పగించాలంటే వారికి మనసొప్పడం లేదు. అక్కడి ఫర్నిచర్ లో కొంత భాగాన్ని తమకు వదిలేయాలని, దానికి విలువ కడితే ఆ మొత్తం చెల్లిస్తామని, మిగిలిన ఫర్నిచర్ తిరిగి ఇస్తామని వైసీపీ జనరల్ సెక్రటరీ, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి జీఏడీ కి లేఖ రాశారు. చాన్సు దొరికింది కదా.. అని ఫర్నిచర్ వాడుకుంటున్నారనే కేసులు పెట్టి.. జగన్ ను భ్రష్టు పట్టించడానికి ఇప్పటి ప్రభుత్వం కొత్త కుట్రలేమీ చేయలేదు. హుందాగానే వ్యవహరించింది. కాకపోతే వారు కోరుతున్నట్లుగా కొంత ఫర్నిచర్ వారికే అమ్మేస్తారా? లేదా? అనేది మాత్రం ఇంకా తేలలేదు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles