టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన కొత్త సినిమా పేరు కిష్కింధపురి. వీరిద్దరూ గతంలో రాక్షసుడు సినిమాలో కలిసి నటించగా, ఇప్పుడు మరోసారి ఈ హారర్ థ్రిల్లర్‌లో జంటగా కనిపిస్తున్నారు. దర్శకుడు కౌశిక్ పగళ్ళపూడి తెరకెక్కించిన ఈ చిత్రం నుంచి తాజాగా ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
ట్రైలర్‌లో ఒక చిన్న ఊరిలో దయ్యాల గురించి పరిశోధన చేయడానికి వెళ్లే యువతీ యువకుల బృందం కనిపిస్తుంది. అక్కడ నిజంగానే ఆత్మ ఉందని తెలిసి వారు ఎదుర్కొన్న భయానక సంఘటనలు, ఆ దెయ్యం వెనకున్న రహస్యం ఏమిటి, హీరో దానిని ఎలా ఎదుర్కొన్నాడు, హీరోయిన్‌కి ఏమైంది అన్న విషయాలు ఉత్కంఠభరితంగా చూపించారు.
సాయి శ్రీనివాస్ ఈసారి మరింత ఎనర్జీతో, యాక్షన్‌కి సరిపోయే లుక్‌తో కనిపించాడు
