జాక్‌పాట్‌ కొట్టిన కిరణ్‌ అబ్బవరం!

Saturday, January 18, 2025

హీరో కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న తాజా చిత్రం “క”. సుజీత్ – సందీప్ అనే ఇద్దరు కొత్త దర్శకులు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. హిట్లు లేక సతమతమవుతున్న కిరణ్ ‘క’ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకొన్నాడు. ఈ సారి రొటీన్ మాస్ కథలు కాకుండా సాలిడ్ సబ్జెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇటీవల ఈ మూవీ నుండి విడుదలైన టీజర్ కి మంచి ఫీడ్ బ్యాక్ దక్కింది. దీంతో ఈ చిత్ర థియేట్రికల్ రైట్స్ కోసం తీవ్ర పోటీ నెలకొంది.

“క” టీజర్ ఇంప్రెసివ్ గా ఉండడంతో రెండు తెలుగు రాష్ట్రాలకుగాను రైట్స్ దక్కించుకునేందుకు రెండు పెద్ద సంస్థలు పోటిపడ్డాయి. ఫైనల్ గా టాలీవుడ్ కి చెందిన ఒక లీడింగ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రూ.12 కోట్లకు దీని హక్కులను కొనుగోలు చేసింది. దానికి సంబంధించిన అధికారక ప్రకటన త్వరలోనే విడుదల కానుంది. కిరణ్ గత చిత్రాలతో పోల్చుకుంటే ఇది భారీ ధర అనే చెప్పుకోవచ్చు. ఈ చిత్రం కథపై నమ్మకంతో సదరు సంస్థ భారీ ధర పెట్టినట్టు సమాచారం.

తానూ ఈ చిత్రంతో కమ్ బ్యాక్ ఇస్తానని ఈ యంగ్ హీరో గట్టి నమ్మకంతో ఉన్నాడు. ఇక ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరానికి జోడిగా నయన్ సారిక నటిస్తుండగా, సామ్ సి ఎస్ సంగీతం అందిస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళ్, మళయాళం, కన్నడ, హిందీ భాషలలో రానున్న ఈ చిత్రాన్ని శ్రీచక్ర ఎంటర్టైన్మెంట్స్ బ్యానేర్ పై చింతా గోపాల కృష్ణ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles