కిక్కు దిగింది.. కొత్త డ్రామాకు తెరలేపుతున్న జగన్!

Wednesday, January 22, 2025

జగన్మోహన్ రెడ్డి అహంకారం కొద్దికొద్దిగా పల్చబడుతోంది. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలందరినీ పురుగుల్లాగా చూస్తూ తన చెంతకు రానివ్వకుండా చెలరేగిపోయిన ఆయన ఇప్పుడు ప్రజా దర్బార్ అంటూ ప్రతిరోజూ వారి నుంచి వినతి పత్రాలు స్వీకరించడానికి ఒక సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. తాడేపల్లిలో ఈనెల 15 నుంచి ‘ప్రజా దర్బార్’ పేరుతో పార్టీ కార్యకర్తలు, సామాన్య ప్రజల విజ్ఞప్తులు స్వీకరించడానికి రంగం సిద్ధం అవుతోంది. ఐదేళ్ల పరిపాలన కాలంలో జగన్ ఎన్నడూ ప్రజలను కలిసింది లేదు. వారిని తన నివాసం వద్దకు అనుమతించింది లేదు. అయితే ఇప్పుడు ఓటమి తర్వాత తీరు మార్చుకోకుంటే మరింతగా పతనం తప్పదనే భయంతోనే ఆయన ఈ పనులు చేస్తున్నట్లుగా కనిపిస్తుంది.
నిజానికి వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ప్రతిరోజు తన క్యాంపు కార్యాలయంలో ఉదయం సామాన్య ప్రజలను కలిసి వినతి పత్రాలు స్వీకరించేవారు. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి లో భవనం నిర్మించుకున్నప్పుడు కూడా ఇలా ప్రజలను, కార్యకర్తలను కలవడానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు అప్పట్లోనే చేసుకున్నారు. భారీ షెడ్లు ఏర్పాటు చేశారు. క్యూలైన్లో నిలబడలేని వారు సేదతీరేందుకు షెడ్లు, కుర్చీలు ఏర్పాటు చేయించారు. ఆ నిర్మాణాలన్ని చాలా పకడ్బందీగా ఉన్నాయి. కానీ,  ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదేళ్లలో ఒక్కసారి కూడా ఆయన ప్రజల్ని అక్కడ కలవలేదు. కనీసం పార్టీ నేతలను కూడా అక్కడి వరకు రానివ్వలేదు.

ప్రజలు తనను నేరుగా కలిసి సమస్యలు చెప్పుకునేందుకు స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తానని సీఎంగా ఉండగా జగన్ చెప్పారు గానీ ఆయన దాన్ని వాయిదా వేసుకుంటూ ఐదేళ్ల కాలం గడిపేశారు. స్పందన, ప్రజా దర్బార్, రచ్చబండ, పల్లెబాట ఇలా రకరకాల పేర్లు పెట్టినా ఆయన ఎన్నడూ ప్రజలను కలిసి వారి బాధలు వినలేదు. నిజానికి వివిధ ప్రాంతాల్లో పర్యటించే సమయంలో ప్రజలు కనీసం ఆయనను చూసే అవకాశం కూడా లేకుండా రోడ్లంతా పరదాలు కట్టి అనేక నిషేధాజ్ఞలను అమలు చేశారు.

అలాంటి జగన్ కు ఓటమి తర్వాత జ్ఞానోదయం కలిగినట్లుగా ఉంది. ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రజాదర్బార్ నిర్వహించాలని ఆయన అనుకుంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజాదర్బార్ అనే మాట బాగానే ఉంటుంది కానీ.. ఏదో గర్వంగా రాజరనికపోకడలాగా ధ్వనించే ఈ మాటను ఓడిపోయిన ఒక మామూలు ఎమ్మెల్యే తాను ప్రజలకు ప్రజలను కలిసే కార్యక్రమానికి పెట్టుకోవడం కామెడీగా ఉన్నదని ప్రజలు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇప్పటికైనా సరే ప్రజలను తాను కలుస్తూ ఉండాలనే జ్ఞానోదయం జగన్మోహన్ రెడ్డికి కలగడం రాష్ట్రానికి మంచిదని వ్యాఖ్య వినిపిస్తోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles