సోషల్ మీడియా పై సీనియర్‌ స్టార్‌ హీరోయిన్‌ కీలక వ్యాఖ్యలు!

Tuesday, January 21, 2025

చిత్ర పరిశ్రమకు సీనియర్‌ నటి జ్యోతిక గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఆమె కేవలం తమిళమే కాకుండా తెలుగులో కూడా సూపర్ హిట్‌ సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకంది. నటుడు సూర్యను పెళ్లి చేసుకున్న తర్వాత నటనకు చాలా కాలం పాటు దూరంగా ఉన్న ఆమె ఇప్పుడు మళ్లీ నటించడం మొదలుపెట్టింది. ఆ మధ్య ఎక్కువగా లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ వచ్చిన ఆమె ఇప్పుడు తెలుగువాడైన అంధుడు శ్రీకాంత్ బొల్లా బయోపిక్ గా తెరకెక్కిన శ్రీకాంత్ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించింది.

 తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆమె హైదరాబాద్ వచ్చింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో  ప్రత్యేకంగా ముచ్చటించింది.
ఈ క్రమంలో సోషల్ మీడియాలో చాలామంది నటులు యాక్టివ్ గా ఉంటున్నారు కానీ మీరు యాక్టివ్‌ గా ఎందుకు ఉండడం లేదు? అని ప్రశ్నిస్తే అది దానికి ఆమె అదిరిపోయే సమాధానం చెప్పింది.

అదేమిటంటే సోషల్ మీడియా అనేది చాలా కాంప్లికేటెడ్ విషయం అని, తనకు ఆ విషయం మీద పూర్తిగా అవగాహన లేదని ఆమె చెప్పుకొచ్చింది. తన కుమార్తె దియ ఇప్పుడిప్పుడే తనకు సోషల్ మీడియా గురించి కొన్ని విషయాలు నేర్పిస్తోందని, ఇంస్టాగ్రామ్ గురించి కూడా తన కూతురే తనకు నేర్పించిందని ఆమె పేర్కొన్నారు.

 తన ట్రావెలింగ్ వీడియోస్, రియల్ అప్డేట్స్ ఆ ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేయడానికి ఇష్టపడుతుంటానని అన్నారు. అంతేకాక నిజానికి ఈ సోషల్ మీడియా మొత్తాన్ని తన కూతురే తనకు నేర్పిస్తోంది అంటూ జ్యోతిక ఈ సందర్భంగా పేర్కొంది. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles