పుష్ప 2 నుంచి మరో సాంగ్‌ !

Wednesday, September 18, 2024

స్టైలిష్‌ స్టార్, జాతీయ నటుడు అల్లు అర్జున్ , క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన “పుష్ప” సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాకు అల్లు అర్జున్ ఏకంగా ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు అందుకున్నాడు.ఈ సినిమాలో అల్లు అర్జున్ తన నటనతో ఎంతగానో మెప్పించాడు. పాన్ ఇండియా స్థాయిలో పుష్ప సినిమా అద్భుత విజయం సాధించింది.

ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 రూపుదిద్దుకుంటుంది.ఈ సినిమా ఆగష్టు 15 న ప్రేక్షకుల ముందుకు రానుంది .ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ చేసిన పోస్టర్స్ ,టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసాయి .ఈ సినిమా నుండి అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా మేకర్స్ ఫస్ట్ సింగల్ ను రిలీజ్ చేసారు. పుష్ప పుష్ప అంటూ సాగె  ఆపాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

 దేవిశ్రీ ప్రసాద్ ఈ పాటకు అదిరిపోయే మ్యూజిక్ అందించినట్లు సమాచారం .ప్రస్తుతం ఈ పాట బాగా ట్రెండింగ్ లో నిలిచింది. ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి మరో సాంగ్ రాబోతున్నట్లు సమాచారం. ఈ సాంగ్ సినిమాకే హైలైట్ గా నిలవనుందని తెలుస్తుంది. ఈ పాటలో పుష్ప జీవితం అంత వివరించనున్నట్లు  సమాచారం. ఈ పాట ఎంతో ఎమోషనల్ గా సాగనుందని తెలుస్తుంది.  ఈ పాటను జూన్ లో విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధం అవుతున్నారు .

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles