కోర్టులో పిటిషన్లు నడపడం ద్వారా రాజకీయ ప్రత్యర్థులను చికాకు పెడుతూ.. అడుగు ముందుకు వేయనివ్వకుండా ఇబ్బంది పెడుతూ ఉండడంలో పేరుమోసిన వైసీపీ నాయకుడు ఆళ్ల రామక్రిష్ణారెడ్డికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఓటుకు నోటు కేసులో ఆయన దాఖలు చేసిన రెండు పిటిషన్లను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు మాత్రం కరకట్ట కమలహాసన్ గా అభిమానులు ముద్దుగా పిలుచుకునే ఆళ్ల రామక్రిష్ణారెడ్డికి చెంపదెబ్బ లాంటివి.
‘రాజకీయ కక్షలు తీర్చుకోవడానరికి కోర్టులను వేదిక చేసుకోవద్దని’ సుప్రీం ధర్మాసనం పిటిషనర్ ను హెచ్చరించడం విశేషం. ఓటుకు నోటు కేసులో ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కూడా నిందితుడిగా చేర్చాలని, ఈ కేసు దర్యాప్తును సీబీఐకు అప్పగించాలని కోరుతూ ఆళ్ల పిటిషన్లు వేశారు. అయితే ఈ కేసులో ఇప్పటికే రెండు చార్జిషీట్లు దాఖలయ్యాయని, కోర్టు జోక్యం చేసుకోవడానికి ఎలాంటి అంశాలు లేవని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు.
ఆధార రహిత అంశాలను తీసుకు వచ్చి కోర్టుతో ఆటలాడుకోవద్దంటూ పిటిషనర్ ను కోర్టు మందలించడం విశేషం. పిటిషనరుకు రాజకీయాలతో ఉన్న అనుబంధం గురించి న్యాయమూర్తులు ఆరా తీశారు. ఆళ్ల ఉన్న పార్టీ కేసును దాఖలు చేసినప్పుడు, ఇప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నదనే సంగతి తెలుసుకుని.. ఆయనకు కావాలిస్తే మళ్లీ పోటీచేసి గెలవాలే తప్ప.. ఇలాంటి రాజకీయ ద్వేషాలతో కోర్టులో కేసులు వేయడం తగదని హెచ్చరించింది.
ఆళ్ల రామక్రిష్ణా రెడ్డి ఏదో చంద్రబాబును బద్నాం చేయడానికి సుప్రీం కోర్టు దాకా తన సొంత ఖర్చులతో కేసులు నడుపుతున్నారు గానీ.. పార్టీలో మాత్రం ఆయనకు ఏమాత్రం విలువ లేదన్నద అందరికీ తెలిసిన సంగతే. ఆయనను గెలిపిస్తే మంత్రిని చేస్తానన్న జగన్ ఆ విషయం అసలు పట్టించుకోలేదు. ఈ ఎన్నికల్లో అసలు టికెటే ఇవ్వలేదు. ఆయన అలిగి షర్మిల వెంట కాంగ్రెసులోకి వెళ్లి.. రెండు రోజుల వ్యవధిలోనే తిరిగి వైసీపీలోకి వచ్చారు. అప్పటినుంచి సైలెంట్ గానే ఉన్నారు. కోర్టు మందలింపుల నేపథ్యంలో ఇక మీదట కూడా సైలెంట్ గానే ఉంటారని ప్రజలు అనుకుంటున్నారు.
కరకట్ట కమలహాసన్ కు సుప్రీంలో ఎదురుదెబ్బ!
Wednesday, January 22, 2025