కన్నడ ఇండస్ట్రీతో పాటు పాన్ ఇండియా ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం “కాంతార 1”. ఈ సినిమాను రిషబ్ శెట్టి స్వయంగా దర్శకత్వం వహించి, హీరోగా కూడా నటిస్తున్నారు. రీసెంట్‌గా రిలీజ్ చేసిన ట్రైలర్‌తో ఈ సినిమాపై మరింత బజ్ పెరిగింది.
తెలుగు, కన్నడ, హిందీ, తమిళ్, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదలైన ట్రైలర్‌కి కేవలం 24 గంటల్లోనే భారీ రెస్పాన్స్ వచ్చింది. మేకర్స్ తెలిపిన సమాచారం ప్రకారం, ట్రైలర్ 107 మిలియన్ పైగా వ్యూస్ అలాగే 3.7 మిలియన్ లైక్స్ సాధించింది. దీని ద్వారా ఈ సినిమాపై ఉన్న ఆసక్తి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించగా, సంగీతాన్ని అజనీష్ లోకనాథ్ అందించారు.
